మద్యం జోలికి వెళ్లలేదు

ABN , First Publish Date - 2021-06-23T06:05:20+05:30 IST

మద్యానికి తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు తమిళ హీరో శింబు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మానాడు’...

మద్యం జోలికి వెళ్లలేదు

మద్యానికి తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు తమిళ హీరో శింబు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మానాడు’. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్విట్టర్‌లో జరిగిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్రబృందంతో కలసి శింబు పాల్గొన్నారు. మాటల సందర్భంలో ఆయన తాను మద్యానికి దూరమై ఏడాదికి పైనే అయిందని చెప్పారు. ‘‘పలు సందర్భాల్లో పార్టీల్లో పాల్గొన్నప్పటికీ మనో నిగ్రహం కోల్పోలేదు, మద్యం జోలికి వెళ్లలేదు. ఆ నిర్ణయం నాకు చాలా మేలు చేసింది’’ అని శింబు చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘ఈశ్వరన్‌’, పాథ్తుతల’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘మహా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Updated Date - 2021-06-23T06:05:20+05:30 IST