తండ్రి పై ప్రేమతో ట్వీట్ చేసిన నాగార్జున
ABN , First Publish Date - 2021-09-20T19:17:06+05:30 IST
ఈరోజు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకుంటూ.. తనయుడు నాగార్జున ఒక అదిరిపోయే ట్వీట్ పెట్టారు.

ఈరోజు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకుంటూ.. తనయుడు నాగార్జున ఒక అదిరిపోయే ట్వీట్ పెట్టారు. నాగార్జున పంచెకట్టుతో ‘బంగార్రాజు’లా మెరిసిపోతూ.. ఓ వీడియో రూపంలో తనకు తన తండ్రి అంటే ఎంతిష్టమో చెప్పారు. మై హీరో .. మై ఇన్స్పిరేషన్ అంటూ.. ట్వీట్ చేసి అక్కినేని నాగేశ్వరరావు ను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎప్పుడూ ధరించే పొందూరు ఖద్దురు పంచెను, నవరత్నాల హారాన్ని, నవరత్నాల ఉంగరాన్ని, వాచ్ ను ధరించారు.
వీడియో లో మాట్టాడుతూ నాగార్జున.. ‘సెప్టెంబర్ 20వ తేదీ నాకు చాలా ఇంపార్టెంట్ డే. మై హీరో, మై ఇన్స్పిరేషన్ నాన్నగారి పుట్టిన రోజు. నాన్నగారికి పంచెకట్టంటే చాలా ఇష్టం.ఆయన పంచె కట్టుకున్నప్పుడల్లా చూస్తుంటే చాలా ముచ్చటేసేది. ఆయనకి పొందూరు ఖద్దరంటే చాలా ఇష్టం.ఇదిగో ఇది పొందూరు ఖద్దరే.. ఇది ఆయన నవరత్నాల హారం. ఆయన నవరత్నాల ఉంగరం. ఈ వాచ్ నా కన్నా సీనియర్. ఆయన ఫేవరేట్ వాచ్. నా ఫేవరేట్ వాచ్. ఇవన్నీ వేసుకుంటే ఆయన నాతోనే ఉన్నట్టుంటుంది. నాన్నగారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే మా ప్రయత్నం.. ఏఎన్నార్ హేట్సాఫ్’.. అంటూ బంగార్రాజు లోని పంచెకట్టులోని తన స్టిల్ ను రివీల్ చేశారు.
