సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akhil akkineni : పోర్టులు చుట్టిన స్టైలిష్ ‘ఏజెంట్’

ABN, First Publish Date - 2021-09-27T15:58:46+05:30

అక్కినేని అఖిల్ నాలుగో మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ దసరాకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక అఖిల్ తన నెక్స్ట్ మూవీ ‘ఏజెంట్’ షూటింగ్ లో ఊపిరి సలపనమంత బిజీగా ఉన్నారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని అఖిల్ నాలుగో మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ దసరాకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెక్స్ట్ మూవీ ‘ఏజెంట్’ షూటింగ్ లో ఊపిరి సలపనమంత బిజీగా ఉన్నారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మెట్ డామన్ ‘బోర్న్’ సిరీస్ ఆధారంగా సురేంద్రరెడ్డి ఈ కథ రాసుకున్నారని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ‘ఏజెంట్’ గా అఖిల్ మేకోవర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ‘ఏజెంట్’ అనౌన్స్ మెంట్ రోజున విడుదల చేసిన అఖిల్ లుక్స్ కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 


‘ఏజెంట్’ మొదటి షెడ్యూల్ .. నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం పోర్ట్ లో కొద్దిరోజులు చిత్రీకరణ జరుపుకోగా.. ఆ తర్వాత వైజాగ్ పోర్ట్ కు షిఫ్ట్ అయ్యారు చిత్ర బృందం. వైజాగ్ కోస్టల్ బెల్ట్ ఏరియాలో మొత్తంలో అనువైన లొకేషన్స్ లో ‘ఏజెంట్’ షూటింగ్ జరిగింది. అలాగే హైద్రాబాద్ లో కొద్దిరోజులు షూటింగ్ జరిగింది. త్వరలోనే ‘ఏజెంట్’ యూనిట్ బుడాపెస్ట్ పయనమవనుంది. అక్కడ కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిపిన తర్వాత హైద్రాబాద్ లో బ్యాలెన్స్ పార్ట్ షూట్ చేస్తారట. దాదాపు రూ. 40కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ‘అఖిల్’ కెరీర్ ను మలుపు తిప్పే సినిమా అవుతుందంటున్నారు. మరి ఏజెంట్ గా అఖిల్ ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి. 

Updated Date - 2021-09-27T15:58:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!