కండల వీరుడైన అఖిల్ అక్కినేని

ABN , First Publish Date - 2021-12-27T17:11:11+05:30 IST

అఖిల్ అక్కినేనికి అందరు స్టార్ హీరోల వారసుల్లా విజయం అంత తొందరగా దక్కలేదు. తొలి మూడు చిత్రాల వరకూ అఖిల్ తో సక్సెస్ దోబూచులాడింది. ఎట్టకేలకు నాలుగో చిత్రమైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇంత కాలానికి దక్కిన ఈ సక్సెస్ ను నిలబెట్టుకొనే ప్రయత్నంలో ప్రస్తుతం అఖిల్ ఉన్నాడు. తాజా చిత్రం ‘ఏజెంట్’ తో అఖిల్ యాక్షన్ హీరో స్టాటస్ తెచ్చుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, వక్కంతం వంశీ కథతో ‘ఏజెంట్’ సినిమా తెరకెక్కుతోంది.

కండల వీరుడైన అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేనికి అందరు స్టార్ హీరోల వారసుల్లా విజయం అంత తొందరగా దక్కలేదు. తొలి మూడు చిత్రాల వరకూ అఖిల్ తో సక్సెస్ దోబూచులాడింది. ఎట్టకేలకు నాలుగో చిత్రమైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇంత కాలానికి దక్కిన ఈ సక్సెస్ ను నిలబెట్టుకొనే ప్రయత్నంలో ప్రస్తుతం అఖిల్ ఉన్నాడు. తాజా చిత్రం ‘ఏజెంట్’ తో అఖిల్ యాక్షన్ హీరో స్టాటస్ తెచ్చుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, వక్కంతం వంశీ కథతో ‘ఏజెంట్’ సినిమా తెరకెక్కుతోంది.  ఇందులో సీక్రెట్ ఏజెంట్ గా అఖిల్ నటిస్తున్నాడు. ఆ పాత్రకు తగ్గరీతిలో అదిరిపోయే మేకోవర్ తో రాబోతున్నాడు. అయితే ఈ పాత్రకోసం అఖిల్ జిమ్ లో గంట తరబడి వర్కవుట్స్ చేస్తున్నాడు. దాని ఫలితంగా అఖిల్ ఇప్పుడు కండల వీరుడయ్యాడు. 


తాజాగా అఖిల్ కండల తిరిగిన శరీరంతో రివీలైన ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ఏజెంట్’ సినిమాలోని లుక్ కోసమే అఖిల్ మజిల్ పవర్ ను చూపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఫోటోలో మజిల్స్ తో పాటు నరాలు కూడా మెలితిరిగినట్టుగా కనిపిస్తోంది. అఖిల్ ను ఈ విధంగా ఎప్పుడూ చూసి ఎరుగని ఫ్యాన్స్ ఈ లుక్ కు ఫిదా అయిపోతున్నారు. జేమ్స్ బాండ్ తరహా చిత్రానికి ఆ మాత్రం బాడీ ఉండాలని జనం చర్చించుకుంటున్నారు. అక్కినేని వారి వంశంలో ఈ తరహాలో ఎవరూ ఇంత దేహ దారుఢ్యాన్ని ప్రదర్శించలేదు. ఆ క్రెడిట్ మాత్రం అఖిల్ కే దక్కుతుంది. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఏజెంట్ చిత్రానికి అఖిల్ బాడీ ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2021-12-27T17:11:11+05:30 IST