‘అఖండ’ ట్రైలర్ రిలీజ్ లేదు!
ABN , First Publish Date - 2021-05-04T21:10:07+05:30 IST
బాలకృష్ణ హీరోగా బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ’ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే అదే రోజు ‘అఖండ’ ట్రైలర్‌కు ముహూర్తం పెట్టారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాలకృష్ణ హీరోగా బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ’ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే అదే రోజు ‘అఖండ’ ట్రైలర్‌కు ముహూర్తం పెట్టారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తల్ని నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ఖండించారు. ‘‘ప్రస్తుత పరిస్థితులు సినిమా విడుదలకు అనుకూలంగా లేవు. ఇలాంటి సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేము. అందుకే 15 రోజుల్లో షెడ్యూల్‌లో రెండు పాటలు, ఓ క్లైమాక్స్ ఫైట్ ఉన్నప్పటికీ షూటింగ్ ఆపేశాము. పరిస్థితులు ఎప్పటికి సాధారణ స్థితికి వస్తాయో ఎవరికీ తెలీదు. అంతా సర్దుకున్నాక షూటింగ్ మొదలుపెడతాం. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఈ నెల 28న విడుదల చేయడం లేదు. ట్రైలర్ బయటికొస్తే సినిమా మీద అంచనాలు పెరుగుతాయి. ప్రస్తుతం బయట పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ట్రైలర్ విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.