సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దీపావళికి ఆకాష్ 'రొమాంటిక్' విడుదల

ABN, First Publish Date - 2021-09-25T18:41:58+05:30

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటించిన లెటెస్ట్ మూవీ 'రొమాంటిక్'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రబృందం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటించిన లెటెస్ట్ మూవీ 'రొమాంటిక్'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. కోవిడ్ వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయియి. కానీ అవన్నీ పూర్తిగా అవాస్తమని మేకర్స్ తేల్చేశారు. తాజాగా 'రొమాంటిక్' చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో నవంబర్ 4న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా వదిలారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి-ఛార్మి నిర్మించారు.

Updated Date - 2021-09-25T18:41:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!