అజిత్‌ ‘వలిమై’ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

ABN, First Publish Date - 2021-01-19T23:40:12+05:30

స్టార్‌ హీరో అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'వలిమై' టీజర్‌ తమిళ కొత్త సంవత్సరాది అయిన ఉగాదికి విడుదల కానుంది. ‘నెర్కొండ పార్వై’ చిత్రం తర్వాత అజిత్

అజిత్‌ ‘వలిమై’ టీజర్ వచ్చేది అప్పుడేనా..?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్‌ హీరో అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'వలిమై' టీజర్‌ తమిళ కొత్త సంవత్సరాది అయిన ఉగాదికి విడుదల కానుంది. ‘నెర్కొండ పార్వై’ చిత్రం తర్వాత అజిత్‌, హెచ్‌.వినోద్‌, యువన్‌ శంకర్‌ రాజా, బోనీ కపూర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వలిమైలో అజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తోంది.  టాలీవుడ్‌ యువనటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమై యేడాది గడిచినా ఇప్పటివరకు ఒక్క అప్‌డేట్‌ కూడా చిత్ర యూనిట్‌ వెల్లడించలేదు. ఈ యేడాది పొంగల్‌కు అయినా ఈ మూవీ అప్‌డేట్‌ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ, చిత్ర యూనిట్‌ నిరాశపరిచింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 14వ తేదీన తమిళ సంవత్సరాది ఉగాదికి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయంపై త్వరలో ఓ క్లారిటీ రానుంది. అంతేకాకుండా, కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగును త్వరలోనే గుజరాత్‌ రాష్ట్రంలో తిరిగి ప్రారంభించాలని దర్శకుడు ప్లాన్‌ చేశారు.

Updated Date - 2021-01-19T23:40:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!