సోషల్ మీడియాలో ‘వలిమై’ స్టిల్ వైరల్
ABN, First Publish Date - 2021-01-01T18:37:29+05:30
అజిత్ హీరోగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘వలిమై’. ఈ సినిమా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అజిత్ హీరోగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘వలిమై’. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అజిత్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఆ వివరాలకు సంబంధించిన ఫొటోలు బయటకు రాకపోవడంతో అజిత్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి అజిత్ మోటార్ బైకును వేగంగా నడుపుతున్న ఓ ఫొటో మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మరో ఫొటో సోషల్ మీడియాలో వచ్చింది. అందులో అజిత్ క్లీన్ షేవ్‌తో యువకుడిలా కనిపిస్తున్నారు. అజిత్‌కు ఇరువైపుల రెండు జంటలు నిల్చుని ఉండగా, వారిముందు ప్రముఖ నటి సుమిత్ర కుర్చీలో కూర్చొని వుంది. ఆ గ్రూప్ ఫొటోను చూసిన అభిమానులు ‘వలిమై వేడుకలు ఆరంభం’ అంటూ లైక్‌లు కొడుతున్నారు.