‘అహం రీబూట్‌’ మొదలైంది!

ABN , First Publish Date - 2021-11-15T22:42:04+05:30 IST

సుమంత్‌ హీరోగా ‘అహం రీబూట్‌’ చిత్రం గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్త నిర్మాణంలో రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, శరణ్‌ కొప్పిశెట్టి క్లాప్‌ కొట్టారు.

‘అహం రీబూట్‌’ మొదలైంది!

సుమంత్‌ హీరోగా ‘అహం రీబూట్‌’ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్త నిర్మాణంలో రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, శరణ్‌ కొప్పిశెట్టి క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ‘‘అహం అంటే నేను. అహం రీబూట్‌ అంటే సెల్ఫ్‌ రీబూట్‌, ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని  ఈ చిత్రంలో చెబుతున్నాం. ఇందులో సుమంత్‌ ఆర్‌జెగా కనిపిస్తారు. సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం – శ్రీరామ్‌ మద్దూరి, సినిమాటోగ్రఫీ – వరుణ్‌ అంకర్ల. 


Updated Date - 2021-11-15T22:42:04+05:30 IST