మరోసారి రియల్ హీరో అనిపించుకుంటోన్న నటుడు జీవన్
ABN, First Publish Date - 2021-05-14T22:05:19+05:30
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఎందరో మానవత్వంతో ముందుకు వస్తున్నారు. గత సంవత్సరం కూడా లాక్‌డౌన్ టైమ్‌లో కూడా ఎందరో మానవత్వం ప్రదర్శించి.. కరోనా కష్టాలను అనుభవించిన వారిని ఆదుకున్నారు. మళ్లీ లాక్‌డౌన్ నడుస్తోంది. ప్రజలెందరో
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఎందరో మానవత్వంతో ముందుకు వస్తున్నారు. గత సంవత్సరం కూడా లాక్‌డౌన్ టైమ్‌లో కూడా ఎందరో మానవత్వం ప్రదర్శించి.. కరోనా కష్టాలను అనుభవించిన వారిని ఆదుకున్నారు. మళ్లీ లాక్‌డౌన్ నడుస్తోంది. ప్రజలెందరో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం మరోసారి నేనున్నానంటూ సాయం అందిస్తున్నారు నటుడు జీవన్ కుమార్. గతేడాది కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల, భోజనం పంపిణీ చేసిన జీవన్ కుమార్ అండ్ టీం సేవలు ఇప్పుడు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. నిరుపేదలు, కరోనా బారిన పడి ఎవరి అండా లేని వారికి జీవన్ కుమార్ అండ్ టీం మేమున్నాం అనే భరోసానిస్తుంది. మూడు వందల కరోనా పేషెంట్స్‌కు రోజూ కడుపు నింపుతున్నాడు జీవన్.
స్వతహాగా రెస్టారెంట్ బిజినెస్‌లో అనుభవం కల జీవన్ కుమార్.. గత సంవత్సరం తన రెస్టారెంట్ నుండే కరోనా సహాయ కార్యక్రమాలను కొనసాగించాడు. మానవతావాదిగా జీవన్ కుమార్ అందించిన సేవలను సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ కూడా కొనియాడారు. ఇప్పుడు కూడా జీవన్ తన దాతృత్వాన్ని వదలలేదు. తన టీంతో బద్రాద్రి కొత్తగూడంలోని ట్రైబల్ ఏరియాలకు 10వేల కేజీల రైస్‌ని పంపిణీ చేశాడు. ఆక్సిజన్ కొరత ఇప్పడు ఎంత పెద్ద సమస్యో అందరికీ తెలిసిందే. ఈ టైమ్‌లో ఆక్సిజన్ రీఫిల్లింగ్ సెంటర్‌లను, 200 సిలెండర్స్‌ని అత్యవసర కేసులకు అందించగలిగాడు. మాస్కులు, శానిటైజర్స్ అందుబాటులో లేని పేదలకు వాటిని ఇంటి ఇంటికి తిరిగి పంపిణీ చేసి వాటిపై అవగాహన కల్పించాడు. అతని సేవలకు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం ప్రశంసలు తెలుపుతున్నారు. కాగా, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చిన జీవన్.. వరుస అవకాశాలను పొందుతూ బిజీ నటుడిగా మారారు. రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే.