లవర్ ఎవరో చెప్పను.. కానీ ప్రేమలో ఉన్నా: అడివి శేష్

ABN , First Publish Date - 2021-06-04T04:06:42+05:30 IST

ఈ మధ్య టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌పై అనేకానేక గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన బాలీవుడ్‌కి చెందిన ఓ నటితో సహజీవనం చేస్తున్నట్లుగానూ, ఆ అమ్మాయినే త్వరలో అడివి శేష్ పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఇలా అతనిపై

లవర్ ఎవరో చెప్పను.. కానీ ప్రేమలో ఉన్నా: అడివి శేష్

ఈ మధ్య టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌పై అనేకానేక గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన బాలీవుడ్‌కి చెందిన ఓ నటితో సహజీవనం చేస్తున్నట్లుగానూ, ఆ అమ్మాయినే త్వరలో అడివి శేష్ పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఇలా అతనిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇటువంటి వార్తలన్నింటికీ.. తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు అడివి శేష్. లవర్ ఉంది కానీ.. ఆమెది బాలీవుడ్ మాత్రం కాదని శేష్ చెప్పుకొచ్చాడు. ఆమె వివరాలు మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేనని శేష్ తెలిపారు. 


‘‘ప్రస్తుతం నా సినీ కెరీర్ చాలా బాగుంది. నా ధ్యాసంతా ఇప్పుడు సినిమాలపైనే ఉంది. వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేసి ఉన్నాను. షూటింగ్స్‌తో అసలు గ్యాప్ ఉండటం లేదు. పెళ్లి గురించి ఆలోచించే టైమ్ కూడా లేదు. ఇక ప్రేమ గురించి చెప్పాలంటే.. నిజమే.. నేను ఒకర్ని ప్రేమిస్తున్నాను. నా లవర్ ఎవరో చెప్పలేను. చెప్పాలంటే ఆ అమ్మాయి అనుమతి కావాలి. అయితే అందరూ అనుకుంటున్నట్లు.. ఆమె బాలీవుడ్ అమ్మాయి కాదు. హైదరాబాదీనే..’’ అని అడివి శేష్ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-04T04:06:42+05:30 IST