ఆనందమే అందం

ABN , First Publish Date - 2021-08-29T05:30:29+05:30 IST

అందం, అభినయంలో కథానాయిక ‘అదితి రావ్‌ హైదరీ’లో ఏదో సమ్మోహక శక్తి ఉంది. బాలీవుడ్‌ లుక్స్‌ ఉన్న ఈ అమ్మడు హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తన స్కిన్‌టోన్‌ రహస్యమేంటో ఆమె మాటల్లోనే..

ఆనందమే అందం

అందం, అభినయంలో కథానాయిక ‘అదితి రావ్‌ హైదరీ’లో ఏదో సమ్మోహక శక్తి ఉంది. బాలీవుడ్‌ లుక్స్‌ ఉన్న ఈ అమ్మడు హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తన స్కిన్‌టోన్‌ రహస్యమేంటో ఆమె మాటల్లోనే..


‘‘ఈ సౌందర్యం దేవుడిచ్చింది. ఇందుకు గర్వపడతాను. ఆనందం, ఆరోగ్యం, ప్రేమ, మంచి ఆహారమే.. మనిషిని మరింత అందంగా కనిపించేలా చేస్తాయని నా నమ్మకం. కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్‌ అయ్యా. నేను నాతో ఉన్నా. పాటలు పాడుతూ, డ్యాన్స్‌, యోగాతో సేద తీరా. వాస్తవానికి నా స్కిన్‌ టోన్‌ చూసిన వారు.. ఏవో సౌందర్య లేపనాలు వాడుతున్నానని అనుకుంటారు. లేదంటే.. నమ్మరే నమ్మరు. అయితే వంటింట్లో అనుబంధంగా ఉండే సహజమైన రెమిడీస్‌పైనే ఆధారపడతా. నిమ్మకాయ, పెరుగు, మందారం, తులసి, అలొవెరా.. లాంటివే నాకిష్టం. చర్మానికి కొత్తగా సౌందర్య లేపనాలు వాడాల్సిన అవసరం లేదు. సినిమాల కోసం మాత్రం మేకప్‌ వేస్తా. నిజ జీవితంలో వేసుకోవడం ఇష్టముండదు. సూర్యోదయం, సూర్యాస్తమయం, పక్షుల కిలకిల రావాలు చూస్తూ జీవించటమంటే ఇష్టం. ప్రకృతి అంటేనే మ్యాజిక్‌తో పాటు మిరాకిల్‌ కూడా. నాలోని ఆశావహ దృక్పథమే అంతఃసౌందర్యం. యాటిట్యూడ్‌, ఆనందమనేది ఓ మైండ్‌సెట్‌ అని నా అభిప్రాయం. చిన్న చిన్న సంతోషాలే వెలకట్టలేని జ్ఞాపకాలు. మంచి ఆహారం తినడం, ఇష్టమైన సంగీతం వినడం.. నచ్చిన పని చేయడమే ఆనందం. మనసు ఆనందంగా ఉన్నప్పుడే మరింత అందంగా కనపడతారనేది ముమ్మాటికి నిజం.’’

Updated Date - 2021-08-29T05:30:29+05:30 IST