టూ పీస్‌లో.. పూనమ్ బజ్వా ఇచ్చిన షాక్‌కి నెటిజన్ల మతులుపోతున్నాయ్

ABN , First Publish Date - 2021-11-13T02:20:41+05:30 IST

పూనమ్ బజ్వా.. ఈ పేరు వింటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా హీటెక్కిపోతోంది. ‘మొదటి సినిమా, బాస్, పరుగు’ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న పూనమ్ బజ్వా.. ఇటీవల తన ప్రియుడు..

టూ పీస్‌లో.. పూనమ్ బజ్వా ఇచ్చిన షాక్‌కి నెటిజన్ల మతులుపోతున్నాయ్

పూనమ్ బజ్వా.. ఈ పేరు వింటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా హీటెక్కిపోతోంది. ‘మొదటి సినిమా, బాస్, పరుగు’ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న పూనమ్ బజ్వా.. ఇటీవల తన ప్రియుడు సునీల్ రెడ్డి (తిక్క మూవీ దర్శకుడు)ని వివాహం చేసుకున్నట్లుగా తెలిపింది. అంతేకాదు, ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లికి ముందు కాస్త పద్దతిగా, ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న పూనమ్ బజ్వా.. పెళ్లి తర్వాత మాత్రం అస్సలు తగ్గేదే..లే అన్నట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. అన్నట్లు ఈ మధ్య సింగిల్‌గానే తప్ప.. ప్రియుడితో కలిసి ఉన్న ఫొటో ఒక్కటి కూడా ఆమె పోస్ట్ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె తీరు చూసిన వారంతా.. అసలిప్పుడు వీరు రిలేషన్‌లోనే ఉన్నారా? అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే, హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పూనమ్ బజ్వా.. తాజాగా టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు వావ్ అంటూ ఆశ్చర్యపోతూ మతి పోగోట్టేశావ్ అంటుంటే.. మరికొందరు నెటిజన్లు డర్టీడర్టీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలకు లైకుల మీద లైకులు వస్తుండటం విశేషం. కొన్నాళ్లుగా ఫొటోలతో కవ్విస్తున్న పూనమ్ అందాలను చూసేందుకు ఆమె పేజీని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటం చూస్తుంటే.. ఆమె ఏ విధంగా విందు ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.



Updated Date - 2021-11-13T02:20:41+05:30 IST