సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నటి న్యూడ్ ఫొటోపై ప్రశంసలు!

ABN, First Publish Date - 2021-01-06T14:40:33+05:30

టీవీ నటి, `కబీర్ సింగ్` ఫేమ్ వనితా ఖరత్ చేసిన ఓ పని ప్రశంసలు అందుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీవీ నటి, `కబీర్ సింగ్` ఫేమ్ వనితా ఖరత్ చేసిన ఓ పని ప్రశంసలు అందుకుంటోంది. వనిత తాజాగా ఓ న్యూడ్ ఫొటోషూట్‌లో పాల్గొని ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాధారణంగా న్యూడ్ ఫొటోషూట్ అంటే విమర్శలు వస్తుంటాయి. అయితే ఈమె ఫొటోపై మాత్రం ప్రశంసలు కురుస్తున్నాయి. దానికి కారణం ఆమె ఉద్దేశం మంచిది కావడమే. 


బాడీ షేమింగ్‌కు వ్యతిరేకంగా ఆమె తన న్యూడ్ ఫొటోను పోస్ట్ చేసింది. ఆమె నగ్న శరీరం ముందు ఓ నీలి రంగు గాలి పటం మాత్రమే ఉంది. `నా ప్రతిభ పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను. నా కల, నా నమ్మకం, నా శరీరం పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే నేనంటే నేనే గనుక` అంటూ కామెంట్ చేసింది. వనిత ఫొటోపై, ఆమె ఆత్మవిశ్వాసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 



Updated Date - 2021-01-06T14:40:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!