నటి మాలాశ్రీ భర్త రాము కరోనాతో మృతి
ABN , First Publish Date - 2021-04-27T04:09:50+05:30 IST
తెలుగు, కన్నడ, తమిళ భాషలలో ప్రముఖ హీరోయిన్‌గా రాణించి, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని పొందిన నటి మాలాశ్రీ భర్త, సినీ నిర్మాత కుణిగల్ రాము (52) కొవిడ్‌తో మృతిచెందారు. వారం క్రితం కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ

తెలుగు, కన్నడ, తమిళ భాషలలో ప్రముఖ హీరోయిన్‌గా రాణించి, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని పొందిన నటి మాలాశ్రీ భర్త, సినీ నిర్మాత కుణిగల్ రాము (52) కొవిడ్‌తో మృతిచెందారు. వారం క్రితం కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరు నగరంలోని మత్తికెరెలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన రాము.. కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగారు. గోలీబార్ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయమైన ఆయన దాదాపు 39 సినిమాలను నిర్మించారు. శాండల్‌వుడ్‌లో కోట్లాది రూపాయలతో సినిమా తీసిన నిర్మాతగా ‘కోటి రాము’గా ఆయన పేరొందారు. ఏకే 47, లాకప్‌డెత్, కలాసిపాళ్య లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించారు. కన్నడ సినిమా రంగంలో హీరోయిన్‌గా రాణిస్తున్న మాలాశ్రీని వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాము మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. నివాళులు అర్పిస్తున్నారు.

