సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్నేహితుడిని పెళ్లాడిన నటి.. ఎవరంటే

ABN, First Publish Date - 2021-01-26T00:09:37+05:30

హీరో శివకార్తికేయన్‌ నటించిన ‘మనం కొత్తి పరవై’ చిత్రం హీరోయిన్‌ మలయాళ కుట్టి ఆత్మీయ పెళ్లిపీటలు ఎక్కింది. ఆమెకు ఇదే తొలి కోలీవుడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌: హీరో శివకార్తికేయన్‌ నటించిన ‘మనం కొత్తి పరవై’ చిత్రం హీరోయిన్‌ మలయాళ కుట్టి ఆత్మీయ పెళ్లిపీటలు ఎక్కింది. ఆమెకు ఇదే తొలి కోలీవుడ్‌ మూవీ. ఆ తర్వాత ‘పోంగడి నీంగళుం ఉంగ కాదలుం’, ‘కావ్యన్‌’ అనే చిత్రాల్లో నటించింది. తాజాగా సుబ్రమణియం శివ దర్శకత్వంలో సముద్రఖని హీరోగా నటించిన ‘వెళ్ళైయానె’ అనే మూవీలో నటించింది. అలాగే, పలు మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఓ కాల్‌ సెంటరులో కూడా పని చేసి, తద్వారా వచ్చిన డబ్బులను సమాజసేవ కోసం ఉపయోగించి తన గొప్పమనసు చాటుకుంది. 


ఆత్మీయ సోమవారం తన స్నేహితుడు సనూఫ్‌ని పెళ్లాడింది. కున్నూరుకు చెందిన సనూఫ్‌ ఓ షిప్పింగ్‌ కంపెనీలో పని చేస్తున్నారు. రెండు కుటుంబాల పెద్దల అనుమతితో వీరి వివాహం జనవరి 25వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు జరిగింది. పెళ్లి రిసెప్షన్‌ మంగళవారం సాయంత్రం జరుగనుంది. 

Updated Date - 2021-01-26T00:09:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!