రాత్రికిరాత్రే పెళ్లిపీటలెక్కిన తెలుగు నటి

ABN , First Publish Date - 2021-01-09T18:35:16+05:30 IST

అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఫలితంగా అనేక సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో ‘కయల్‌’, ‘చండీవీరన్‌’,

రాత్రికిరాత్రే పెళ్లిపీటలెక్కిన తెలుగు నటి

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు చెందిన ఆనంది ‘బస్‌స్టాఫ్‌’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ‘పొరియాళన్‌’ అనే మూవీతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఫలితంగా అనేక సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో ‘కయల్‌’, ‘చండీవీరన్‌’, ‘త్రిషా ఇల్లెన్నా నయనతార’, ‘కడవుల్‌ ఇరుక్కాన కుమారు’, ‘విచారణై’, ‘పరియోరుం పెరుమాళ్‌’, ‘ఇరండాం ఉలగపోరిన్‌ కడైసీ గుండు’ వంటి పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా, ఆమె నటించిన ‘టైటానిక్‌ కాదలుమ్‌ కవిళిందు పోగుమ్‌’, ‘అల్లావుద్దీన్‌ అర్బుద కెమెరా’ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అలాగే, ‘ఏంజెల్‌’, ‘రావణకూటం’ ‘కమిలి ఫ్రమ్‌ నడుకావేరి’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో ‘జాంబిరెడ్డి’ చిత్రంలో నటిస్తోంది. ఇలా మంచి ఫామ్‌లో ఉన్న ఆనంది... రాత్రికి రాత్రే పెళ్లిపీటలెక్కింది. 


అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తోన్న సోక్రటీస్‌ అనే వ్యక్తిని గురువారం వరంగల్‌లో పెద్దల సమక్షంలో ఆమె పెళ్ళి చేసుకుంది. ఈ వివాహానికి కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే, ఆనంది ఆకస్మికంగా పెళ్ళిపీటలెక్కడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అంతేకాకుండా, పెళ్ళి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. కానీ, ఇప్పటికే కుదుర్చుకున్న మూవీలను మాత్రం పూర్తి చేస్తుందని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 



Updated Date - 2021-01-09T18:35:16+05:30 IST