దసరాకు కళాకార్‌

ABN , First Publish Date - 2021-09-20T12:40:01+05:30 IST

రోహిత్‌ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కళాకార్‌’. శ్రీను బందెల దర్శకత్వంలో వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు...

దసరాకు కళాకార్‌

రోహిత్‌ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కళాకార్‌’. శ్రీను బందెల దర్శకత్వంలో వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రోహిత్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ప్రభాస్‌ విడుదల చేశారు. రోహిత్‌ మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ టీజర్‌ను విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. సినిమాను దసరాకు విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. 

Updated Date - 2021-09-20T12:40:01+05:30 IST