కేన్సర్‌తో కన్నుమూసిన నటుడు డస్టిన్ డైమండ్

ABN , First Publish Date - 2021-02-02T22:25:05+05:30 IST

అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు డస్టిన్ డైమండ్ క్యాన్సర్‌తో కన్నుమూశాడు. ఆయన వయసు 44 సంవత్సరాలు.

కేన్సర్‌తో కన్నుమూసిన నటుడు డస్టిన్ డైమండ్

న్యూయార్క్: అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు డస్టిన్ డైమండ్ క్యాన్సర్‌తో కన్నుమూశాడు. ఆయన వయసు 44 సంవత్సరాలు. తనకు క్యాన్సర్ సోకినట్టు మూడు వారాల క్రితమే బయటపడగా, అంతలోనే అతడు కన్నుమూయడం చిత్రపరిశ్రమలో విషాదం నింపింది.


కాలిఫోర్నియాకు చెందిన డైమండ్ ‘గుడ్ మార్నింగ్’, ‘మిస్ బ్లిస్’ వంటి టీవీ ప్రోగ్రామ్స్‌తో కెరియర్ ప్రారంభించాడు. ఇది ఒక్క సీజన్‌తోనే ముగిసింది. ఆ తర్వాత 1989లో మొదలైన ‘సేవ్‌డ్ బై ది బెల్’ నాలుగు సీజన్ల పాటు నడిచింది. ఈ ప్రోగ్రాం అమెరికాతోపాటు విదేశాల్లోనూ పాపులర్ అయింది. అనంతరం అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. పలు టెలివిజన్ సినిమాల్లోనూ నటించాడు. చిన్నచిన్న పాత్రలు కూడా చేశాడు. 


అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు, ఓ బార్‌లో జరిగిన కత్తిపోట్ల ఘటనతో సంబంధం ఉన్న ఆరోపణలపై 2015లో అరెస్ట్ అయిన డస్టిన్‌కు కోర్టు  నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, సత్ప్రవర్తన కారణంగా ఒక నెల ముందుగానే, 2016లో జైలు నుంచి డస్టిన్ విడుదలయ్యాడు. 

Updated Date - 2021-02-02T22:25:05+05:30 IST