పుణెలో యాక్షన్‌!

ABN , First Publish Date - 2021-10-04T07:38:22+05:30 IST

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఓ పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక. సినిమా కోసం పుణెలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేస్తున్నారట...

పుణెలో యాక్షన్‌!

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఓ పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక. సినిమా కోసం పుణెలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేస్తున్నారట. అందులో ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్టు తెలిసింది. రామ్‌చరణ్‌, ఇతర తారాగణం పాల్గొనగా యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు శంకర్‌ సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌ షెడ్యూల్‌ ముగిసిన తర్వాత హీరో హీరోయిన్‌ కాంబినేషన్‌ సీన్స్‌ తీయాలనుకుంటున్నారట. నవంబర్‌ నుంచి చిత్రీకరణలో కియారా జాయిన్‌ అవుతారట. రామ్‌ చరణ్‌ పాత్ర, అతని ప్రయాణంలో కథానాయిక పాత్ర ముఖ్య భూమిక పోషిస్తుందట. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తండ్రీకొడుకులుగా కనిపించనున్నారని టాక్‌. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


Updated Date - 2021-10-04T07:38:22+05:30 IST