‘ఆచార్య’ టీమ్ సూపర్ కాంటెస్ట్!

ABN , First Publish Date - 2021-11-16T20:11:51+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘ఆచార్య’. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్, ‘లాహే లాహే, నీలాంబరి’ అనే సింగిల్స్ విడుదలయ్యాయి. ఈ రెండు సింగిల్స్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘ఆచార్య’ టీమ్ సూపర్ కాంటెస్ట్!

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘ఆచార్య’. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే ప్రత్యేక  పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి  ఇప్పటికే ఒక టీజర్, ‘లాహే లాహే, నీలాంబరి’ అనే సింగిల్స్ విడుదలయ్యాయి. ఈ రెండు సింగిల్స్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, పూజా హగ్డే అభినయించిన ‘నీలాంబరి’ సాంగ్ మీద ఒక సూపర్ కాంటెస్ట్ నిర్వహించింది ‘ఆచార్య’ టీమ్.  నీలాంబరి సాంగ్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేసిన సిగ్నేచర్ స్టెప్ తో ఎవరైనా డ్యాన్స్ చేసి పోస్ట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవితో వారికి సెల్ఫీ దిగే అరుదైన అవకాశం కల్పిస్తున్నట్టు కొణిదెల ప్రొడక్షన్ హౌస్ వారు ప్రకటించారు. మరి ఎవరైనా డ్యాన్స్ లో దిట్టైన అభిమానులు ఉన్నట్టైతే వారికి ఇది చక్కటి అవకాశమనే చెప్పాలి. మణిశర్మ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యంతో రామ్ చరణ్, పూజా అద్భుతంగా నర్తించిన ఈ సాంగ్ ను మక్కీకి మక్కీ దింపి .. మెగాస్టార్ తో సెల్ఫీ దిగే అవకాశం ఎవరు అందుకుంటారో చూడాలి. Updated Date - 2021-11-16T20:11:51+05:30 IST