ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్‌కి తేడా లేదు: వర్మ

ABN , First Publish Date - 2021-12-29T23:24:34+05:30 IST

సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే.. ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్ మహమ్మారికి పెద్దగా తేడా లేదని అన్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రెండూ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం తగ్గిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏబీఎన్..

ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్‌కి తేడా లేదు: వర్మ

సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే.. ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్ మహమ్మారికి పెద్దగా తేడా లేదని అన్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రెండూ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం తగ్గిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి‌తో ముచ్చటించిన వర్మ.. సినిమా ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వ వ్యవహార తీరును తప్పుపట్టారు. థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదన్నారు. అసలు వారు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఇండస్ట్రీ పెద్దలంటే.. అంతా బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవపడాలని ఎందుకు అనుకుంటారు? అందుకే వారంతా కామ్‌గా ఉంటున్నారని అన్నారు.


హీరోల రెమ్యూనరేషన్‌పై ఏపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలని స్టుపిడ్ ఆర్గ్యుమెంట్స్‌గా ఆయన కొట్టిపారేశారు. ఎందుకంటే నిర్మాత ఎంత పెట్టి సినిమా నిర్మించాడనేది ఎవరూ చూడరు.. పలానా హీరో బొమ్మ అని మాత్రమే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారని, హీరో అనేవాడు బ్రాండ్ అని వర్మ పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలపై ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అవేంటో తెలియాలంటే పై వీడియో చూడాల్సిందే.

Updated Date - 2021-12-29T23:24:34+05:30 IST