అభిమన్యుడు కాదు...అర్జునుడు

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

‘బలైపోవడానికి నేను అభిమన్యుణ్ణి కాదు...అర్జునుడిని’ అంటున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృతా అయ్యర్‌ కథానాయిక....

అభిమన్యుడు కాదు...అర్జునుడు

‘బలైపోవడానికి నేను అభిమన్యుణ్ణి కాదు...అర్జునుడిని’ అంటున్నారు హీరో శ్రీ విష్ణు.  ఆయన  కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృతా అయ్యర్‌ కథానాయిక. తేజా మార్ని దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. కదనరంగంలోకి దిగిన శ్రీ విష్ణు పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. నరేష్‌, శివాజీరాజా, దేవి ప్రసాద్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం: ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌


Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST