సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అప్పటి వరకు ఆమిర్ ఫోన్ వదిలేస్తాడట!

ABN, First Publish Date - 2021-02-02T19:49:21+05:30

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌ను అందరూ మిస్టర్ పర్ఫెక్షనిస్టు అంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌ను అందరూ మిస్టర్ పర్ఫెక్షనిస్టు అంటారు. తను అనుకున్న విధంగా వచ్చే వరకు సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాడు. ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాడు. తన కొత్త సినిమా `లాల్ సింగ్ చద్దా` కోసం ఆమిర్ తాజాగా అలాంటి కఠిన నిర్ణయమే తీసుకున్నాడట. ఈ సినిమా విడుదలయ్యే వరకు తన మొబైల్ ఫోన్‌ను వాడకూడదని నిర్ణయించుకున్నాడట.


తన ఏకాగ్రత పూర్తిగా సినిమా మీదే ఉండాలనే ఉద్దేశంతో ఆమిర్ తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి పక్కన పెట్టేశాడట. `లాల్ సింగ్ చద్దా` విడుదలయ్యే వరకు దాని జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడట. హాలీవుడ్ క్లాసిక్ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్‌మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. కరీనా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.  

Updated Date - 2021-02-02T19:49:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!