టీజర్‌లోనే సినిమా సత్తా తెలిసింది -గోపిచంద్ మలినేని
ABN, First Publish Date - 2021-07-24T05:27:12+05:30
‘‘హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు. దానికి భిన్నంగా పూజిత పొన్నాడ కథానాయికగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తున్నారు.....
‘‘హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు. దానికి భిన్నంగా పూజిత పొన్నాడ కథానాయికగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తున్నారు. ‘ఆకాశ వీధుల్లో’ చిత్రం ఆమె కెరీర్‌లో మైలు రాయి కావాలి’’ అని దర్శకుడు గోపిచంద్ మలినేని ఆకాంక్షించారు. గౌతమ్‌కృష్ణ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆకాశవీధుల్లో’. పూజిత పొన్నాడ కథానాయిక. మనోజ్ జె.డి., డాక్టర్ మణికంఠ నిర్మాతలు.
ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు గోపిచంద్ మలినేని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘‘టీజర్‌లోనే సినిమా సత్తా ఏంటో తెలిసింది. దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేకపోయినా గౌతమ్‌కృష్ణ సినిమాను బాగా తీయగలిగాడంటే అతనిలో ఉన్న తపనే కారణం’’ అని అన్నారు. ‘‘ఆకాశ వీధుల్లో’ గొప్ప చిత్రంగా నిలుస్తుంది. రాహుల్ సిప్లిగంజ్, చిన్మయి పాడిన పాటలు త్వరలో విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి కథను ఈ సినిమాలో చెప్పాం’’ అని గౌతమ్‌కృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో దేవి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్రలు పోషించారు. జుడా శాండీ సంగీతం అందించారు.