'ఏ' ట్రైలర్‌ విడుదల చేయనున్న విజయ్‌ సేతుపతి

ABN , First Publish Date - 2021-02-02T17:40:56+05:30 IST

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్‌గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం 'A'. ఈ సినిమా ట్రైలర్ ను విజయ్ సేతుపతి విడుదల చేయబోతున్నారు.

'ఏ' ట్రైలర్‌ విడుదల చేయనున్న విజయ్‌ సేతుపతి

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్‌గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం 'A'. కొన్ని సమయాల్లో నిజాలు కల్పితాల కంటే చాలా బలంగా ఉంటాయి. ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్ లలో వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని పీవీఆర్‌ సంస్థ గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. విజయ్ కురాకుల సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటకు శ్రోతలనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫిబ్రవరి 5న విడుదల చేయబోతున్నారు. 

Updated Date - 2021-02-02T17:40:56+05:30 IST