సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'7 డేస్ 6 నైట్స్' చిత్ర సంగీత దర్శకుడికి 16 ఏళ్ళే

ABN, First Publish Date - 2021-09-07T18:49:25+05:30

ప్రముఖ దర్శక, నిర్మాత ఎం.ఎస్.రాజు రూపొందిస్తున్న తాజా చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ చిత్రం ద్వారా 16 ఏళ్ళే కుర్రాడిని సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ దర్శక, నిర్మాత ఎం.ఎస్.రాజు రూపొందిస్తున్న తాజా చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ చిత్రం ద్వారా 16 ఏళ్ళే కుర్రాడిని సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తైన ఈ మూవీకి ప్రస్తుతం రీ రికార్డింగ్ వర్క్ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను దర్శకుడు ఎం. ఎస్. రాజు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఇందులో ఆయనతో పాటు 16 ఏళ్ళ సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి రీ రికార్డింగ్ చేస్తూ ఎంతో హుషారుగా కనిపిస్తున్నాడు. గతంలో ఎమ్మెస్ రాజు 'దేవి' సినిమాతో దేవీశ్రీ ప్రసాద్‌ను టీనేజ్‌లోనే సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ప్రస్తుతం ఆయన రాక్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు. మరి దేవీశ్రీ ప్రసాద్‌లా సమర్థ్ గొల్లపూడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పాపులర్ అవుతాడేమో చూడాలి. 



Updated Date - 2021-09-07T18:49:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!