సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Katrina Kaif -Vicky Kasushal: అందుకే శుభలేఖలు పంపడం లేదట!

ABN, First Publish Date - 2021-11-06T16:47:20+05:30

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ప్రేమజంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ప్రేమజంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. సినిమా ఫంక్షన్లకు, విహార యాత్రలకు కలిసి వెళుతున్నారు. ఈ డిసెంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ జంట ఆ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. పెళ్లిపై  పలు రూమర్లు కొనసాగుతుండగానే తాజా దీపావళి వేడుకల్లో ఈ ఇద్దరూ కలిసి సందడి చేశారు. 


పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా రహస్యంగా చేసుకుంటూ పోతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 7 లేదా 9 తేదీల్లో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ పెళ్లి గురించి కత్రిన స్వయంగా ప్రకటన చేయబోతోందట. తన ప్రకటన కంటే ముందే పెళ్లి గురించి లీక్ కావడం కత్రినకు ఇష్టం లేదట. అందుకే ఇప్పటివరకు ఎవరికీ వివాహ ఆహ్వాన పత్రికలను పంపలేదట. కత్రిన ప్రకటన తర్వాత బాలీవుడ్ ప్రముఖులందరికీ శుభలేఖలు అందుతాయట. కాగా, కాబోయే కోడలు కత్రినకు విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు కూడా తెలుస్తోంది. 

Updated Date - 2021-11-06T16:47:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!