Prabhas కు నువ్వెందుకు అబద్ధం చెప్పావ్..అంటూ Karthik Aaryanఇన్‌స్టాస్టోరీ..హాట్ టాపిక్‌గా మారిన రెబల్ స్టార్ పోస్ట్
ABN, First Publish Date - 2021-10-07T00:37:57+05:30
నేటి ఇంటర్నెట్ యుగంలో ఇతరులను విష్ చేయడం అనేది సాధారణంగా మారింది. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా, ఎవరికైనా సులభంగా శుభాకాంక్షలు చెప్పవచ్చు. హీరో, హీరోయిన్లైనా సోషల్ మీడియాలోనే వేరేవారిని విష్ చేస్తున్నారు.
నేటి ఇంటర్నెట్ యుగంలో ఇతరులను విష్ చేయడం అనేది సాధారణంగా మారింది. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా, ఎవరికైనా సులభంగా శుభాకాంక్షలు చెప్పవచ్చు. హీరో, హీరోయిన్లైనా సోషల్ మీడియాలోనే వేరేవారిని విష్ చేస్తున్నారు. తాజాగా ఒక హీరో మరొ హీరోకి సోషల్ మీడియాలో విష్ చేశారు. ఈ ఇద్దరూ హీరోల మధ్యకి మరొకరు రావడంతో ఆ సంభాషణ ఆసక్తికరంగా మారింది.
బాహుబలి స్టార్ ప్రభాస్ బాలీవుడ్లో ‘‘ఆదిపురుష్’’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించస్తుండగా, సన్నీసింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. సన్నీ సింగ్ అక్టోబర్ 6న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. కానీ, బాహుబలి ముందుగానే అక్టోబరు 5న ఆయనకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ప్రభాస్ పోస్టుకు కార్తీక్ ఆర్యన్ సహా అనేక మంది కామెంట్లు చేశారు.
‘‘అతడు మీకు అబద్ధం చెప్పాడు సార్. అతడి పుట్టిన రోజు రేపు ’’ అని కార్తీక్ కామెంట్ చేశారు. ప్రభాస్ పోస్టును ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కార్తీక్ పంచుకున్నారు. ఆ పోస్టును సన్నీకి కూడా ట్యాగ్ చేశారు. ‘‘ నీ పుట్టిన రోజు రేపు అయితే బాహుబలికి ఎందుకు అబద్ధం చెప్పావు ’’ అని కూడా రాశారు. అందుకు సన్నీ స్పందిస్తూ..‘‘ బాహుబలి ఈ రోజే బర్త్‌డే జరుపుకొమన్నాడు. అందుకే ఈ రోజే నేను పుట్టినరోజు జరుపుకుంటున్నాను. నువ్వు మద్యలో ఎందుకు తల దూరుస్తున్నావు ’’ అని అడిగారు.
గతంలో కార్తీక్ ఆర్యన్, సన్నీసింగ్ కలిసి ఆకాశవాణి, ప్యార్ కా పంచనామా-2, సోను కే టీటూ కీ స్వీటీ తదితర చిత్రాల్లో నటించారు.