అక్షయ్‌కి జోడీగా సారా... ‘ఖిలాడీ’ గురించి సైఫ్ కూతురికి ఏం చెప్పాడంటే...

ABN, First Publish Date - 2021-12-14T02:36:54+05:30

అక్షయ్ ఒకప్పుడు పలు సినిమాల్లో సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించాడు. ఇప్పుడు ఆయన కూతురు సారాతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మరి నాన్న సైఫ్ కూతురు సారాకి... అక్షయ్ ‘అంకుల్’ గురించి ఏం చెప్పి ఉంటాడు?

అక్షయ్‌కి జోడీగా సారా... ‘ఖిలాడీ’ గురించి సైఫ్ కూతురికి ఏం చెప్పాడంటే...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిసెంబర్ 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల అవుతోంది ‘అత్రంగీ రే’. కథ ఏంటో ఇప్పుడే మనకు తెలియకున్నా నటీనటుల కాంబినేషన్ మాత్రం మొదట్నుంచీ ఆసక్తి కలిగిస్తోంది. సూపర్ సీనియర్ అయిన అక్షయ్ ఒక వైపు, సీనియర్ అయిన ధనుష్ ఒక వైపు... మధ్యలో యంగ్ బ్యూటీ సారా అలీఖాన్! ఇదే అంశం అందర్నీ ‘అత్రంగీ రే’ సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తోంది. అయితే, అక్షయ్ ఒకప్పుడు పలు సినిమాల్లో సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించాడు. ఇప్పుడు ఆయన కూతురు సారాతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మరి నాన్న సైఫ్ కూతురు సారాకి... అక్షయ్ ‘అంకుల్’ గురించి ఏం చెప్పి ఉంటాడు? 


‘మై కిలాడీ తూ అనారీ, యే దిల్లగీ, ఆర్జూ’... ఇలా అనేక సినిమాలు అక్షయ్, సైఫ్ కాంబినేషన్‌లో రూపొందాయి 1990లలో. అప్పట్లో తమ కాంబినేషన్ సూపర్ అన్నాడట సైఫ్. అక్షయ్ గురించి మరింతగా సారాకి వివరిస్తూ... ‘‘అక్షయ్ నిజంగా గ్రేట్! అతడితో కలసి పని చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను’’ అని చెప్పాడట. తన తండ్రి అక్షయ్ గురించి చెప్పిన మాటల్ని మీడియాతో పంచుకుంది సారా అలీఖాన్. ‘అత్రంగీ రే’ షూటింగ్ సమయంలో తాను కూడా అక్షయ్‌తో పని చేసేటప్పుడు ఎంతో సరదాగా గడిపిందట. ‘‘ఇండియాలోని ఒక పెద్ద సూపర్‌స్టార్‌తో కలసి పని చేస్తున్నట్టు నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు’’ అంటోంది యంగ్ బ్యూటీ. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే... 1991లో హీరోగా అక్షయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే నాటికి సారా కనీసం పుట్టలేదు కూడా! ఆమె 1995లో జన్మించింది. చూడాలి మరి, వారిద్దరి క్యారెక్టరైజేషన్స్ ‘అత్రంగీ రే’ సినిమాలో ఎలా ఉండబోతున్నాయో...  

Updated Date - 2021-12-14T02:36:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!