విడాకుల తర్వాత సమంత నిర్ణయం ఇదేనా..? ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్..!

ABN , First Publish Date - 2021-10-04T22:05:01+05:30 IST

‘‘నేను ప్రపంచాన్ని మార్చాలి అంటే, ముందు నేను మారాలి. నా మంచం నేనే సద్దుకోవాలి. నా షెల్ఫ్ నేనే శుభ్రం చేసుకోవాలి. నేను చేయాలనుకునే పనుల గురించి కలలు కంటూ మధ్యాహ్నం దాకా పడుకోకూడదు’’ ఈ మాటలు ఎక్కడివో తెలుసా? సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనివి! సమంత స్వయంగా ఈ మాటలు అనలేదు. ఓ పాటలోని లిరిక్స్ అవి. కాకపోతే ఆమె అభిప్రాయం కూడా అదే మనం భావించవచ్చు...

విడాకుల తర్వాత సమంత నిర్ణయం ఇదేనా..? ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్..!

‘‘నేను ప్రపంచాన్ని మార్చాలి అంటే, ముందు నేను మారాలి. నా మంచం నేనే సద్దుకోవాలి. నా షెల్ఫ్ నేనే శుభ్రం చేసుకోవాలి. నేను చేయాలనుకునే పనుల గురించి కలలు కంటూ మధ్యాహ్నం దాకా పడుకోకూడదు’’ ఈ మాటలు ఎక్కడివో తెలుసా? సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనివి! సమంత స్వయంగా ఈ మాటలు అనలేదు. ఓ పాటలోని లిరిక్స్ అవి. కాకపోతే ఆమె అభిప్రాయం కూడా అదే మనం భావించవచ్చు... 

నాగ చైతన్యతో నాలుగేళ్ల వైవాహిక బంధం తరువాత స్యామ్ విడిపోక తప్పలేదు. ఆమెకే కాదు తన అభిమానులకి కూడా ఈ పరిణామం చాలా బాధ కలిగించేదే. కానీ, లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు కదా! అదే ఉద్దేశాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా షేర్ చేసింది సమంత. ఇక మీదట తాను మారిపోతానంటోన్న ‘బేబీ’ కెరీర్ పరంగా భారీ మార్పులకి శ్రీకారం చుట్టబోతోందని సమాచారం. 

సమంత మదర్ టంగ్ తమిళ్ అయినా ఆమె ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, కోలీవుడ్‌లోనూ తనకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో తెలుగులో ‘శాకుంతలం‘ ఉండగా, తమిళంలో విజయ్ సేతుపతితో చేసిన ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా ఉంది. అయితే, లెటెస్ట్‌గా సింగిల్ స్టేటస్‌లోకి మారిపోయిన ‘సమంత రూత్ ప్రభు’ నెక్ట్స్ బాలీవుడ్ మీద ప్రధానంగా దృష్టి పెడుతుందని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళంలో ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్న స్యామ్ ముంబైలోనూ సత్తా చాటాలనుకుంటోందట. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ టూ తరువాత సమంత అంటే ఎవరో ఇప్పటికే హిందీ ఆడియన్స్‌కి తెలిసిపోయింది. కాబట్టి ఆమె బాలీవుడ్ బిగ్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇవ్వటం పెద్ద కష్టమేం కాదు. మరి నిజంగానే, సమంత బీ-టౌన్ బాట పడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Updated Date - 2021-10-04T22:05:01+05:30 IST