నన్ను వెయ్యి మంది రిజెక్ట్ చేశారు: Vicky Kaushal
ABN , First Publish Date - 2021-10-18T21:44:30+05:30 IST
ఎవరి మద్దతూ లేకుండా బాలీవుడ్‌లోకి ప్రవేశించి అనతి కాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు విక్కీ కౌశల్.

ఎవరి మద్దతూ లేకుండా బాలీవుడ్‌లోకి ప్రవేశించి అనతి కాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు విక్కీ కౌశల్. `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్`లో నటనకు జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన తాజా చిత్రం `సర్దార్ ఉదమ్` సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్కీ కౌశల్ తన కెరీర్ ప్రారంభ రోజుల గురించి మాట్లాడాడు.
`నటుడు అవుదామనుకుని ఆడిషన్స్‌కు వెళ్లినపుడు నాకు ఒక విషయం అర్థమైంది. కొన్ని వందల, వేల మంది కోరుకుంటున్న స్థానం కోసం నేను పోటీపడుతున్నానని తెలిసింది. అక్కడి వచ్చిన అందరూ ప్రతిభావంతులే అని అర్థమైంది. నన్ను దాదాపు వెయ్యికి పైగా ఆడిషన్లలో రిజెక్ట్ చేసి ఉంటారు. నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను హాజరైన ఆడిషన్స్‌లో 10 మాత్రమే విజయవంతమయ్యాయి. నా అరంగేట్రం అంత సులభంగా జరగలేద`ని విక్కీ చెప్పాడు.