Vicky Kaushal: ‘ 83’ లో ఆ పాత్రకు నో చెప్పిన విక్కీ కౌశల్
ABN , First Publish Date - 2021-12-30T00:16:54+05:30 IST
రాజీ, ఉరీ : ది సర్జికల్ స్ట్రైక్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన నటుడు విక్కీ కౌశల్. భిన్న రకాల పాత్రలకు ఎప్పుడు ఓకే చెబుతుంటాడు

రాజీ, ఉరీ : ది సర్జికల్ స్ట్రైక్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన నటుడు విక్కీ కౌశల్. భిన్న రకాల పాత్రలకు ఎప్పుడు ఓకే చెబుతుంటాడు. తాజాగా ‘‘ సర్దార్ ఉద్దం’’ సినిమాలో నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ‘ 83 ’ సినిమాలోని ఒక పాత్రకు అతడిని క్యాస్ట్ చేశారు. కానీ, అనేక కారణాల వల్ల అతడు ఆ పాత్రను పోషించలేదు. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘83’ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా విడుదలైంది.
బీ టౌన్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను విక్కీ కౌశల్ డిసెంబర్ 9, 2021న పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో ఘనంగా వీరి వివాహం జరిగింది. అయితే, విక్కీ కౌశల్ ‘ 83 ’ చిత్రంలోని మొహీందర్ అమర్ నాథ్ పాత్రకు ఆడిషన్ ఇచ్చారని చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తి చెబుతున్నారు. కానీ, 2వ హీరోగా చేయడం విక్కీకి ఇష్టం లేకపోవడంతో ఆ పాత్ర నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
‘‘రాజీ సినిమా విడుదలకు ముందు మొహీందర్ అమర్నాథ్ పాత్రకు విక్కీ కౌశల్ ఆడిషన్ ఇచ్చారు. రాజీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలవడంతో ఆ పాత్ర నుంచి తప్పుకున్నారు. కబీర్ ఖాన్ మాత్రం విక్కీ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించారు ’’ అని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. అనంతరం మొహీందర్ అమర్నాథ్ పాత్రలో సాకిబ్ సలీం నటించారు.