ఖరీదైన గిఫ్ట్‌లిచ్చి Katrina Kaif, విక్కీ కౌశల్‌ను సర్‌ప్రైజ్ చేసిన బాలీవుడ్ సెలెబ్రిటీలు

ABN , First Publish Date - 2021-12-14T01:22:03+05:30 IST

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరాలో డిసెంబర్ 9న పెళ్లాడారు

ఖరీదైన గిఫ్ట్‌లిచ్చి  Katrina Kaif, విక్కీ కౌశల్‌ను సర్‌ప్రైజ్ చేసిన బాలీవుడ్ సెలెబ్రిటీలు

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరాలో డిసెంబర్ 9న పెళ్లాడారు. అనంతరం వారు తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో పంచుకోవడం మొదలెట్టారు.  ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. కొత్త జంటను బీ టౌన్ సెలెబ్రిటీలందరూ ఖరీదైన బాహూమతులతో సర్‌ప్రైజ్ చేసినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఆ బహూమతులపై ఓ లుక్కేద్దామా..  ముందుగా విక్కీ కౌశల్ గురించి చెప్పుకోవాలి. అతడు తన భార్యకు రూ. 1.3 కోట్ల విలువ జేసే డైమండ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి కత్రినా కైఫ్ అనేక సినిమాల్లో నటించింది. గత కొన్నేళ్లుగా ఒకరికి మరొకరు తెలుసు. దీంతో బాలీవుడ్ భాయిజాన్ రూ. 3కోట్ల విలువ జేసే రేంజ్ రోవర్ కారును బాహూమతిగా ఇచ్చినట్టు బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కత్రినా కైఫ్‌తో కొంతకాలం రణ్ బీర్ కపూర్ డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం విడిపోయినప్పటికి వీరు సన్నిహిత మిత్రులుగా వీరు కొనసాగుతున్నారు. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి రణ్ బీర్ కపూర్ రూ.2.7కోట్ల విలువ జేసే డైమండ్ నెక్లెస్‌ను బహూమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ అందాల తార ఆలియా భట్ ఫర్‌ఫ్యూమ్ బాస్కెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని విలువ దాదాపుగా లక్షల్లోనే ఉంటుందని సమాచారం. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ రూ.1.5లక్షల విలువ జేసే ఖరీదైన పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్టు బీ టౌన్ వినికిడి. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ బీఎమ్‌డబ్ల్యూ జీ-310ఆర్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. విక్కీ కౌశల్, తాప్సీ కలిసి గతంలో నటించారు. అందువల్ల విక్కీకి  రూ.1.4లక్షల విలువజేసే ప్లాటినం బ్రాస్‌లేట్‌ను ఆమె గిఫ్ట్‌గా ఇచ్చింది.

Updated Date - 2021-12-14T01:22:03+05:30 IST