ముంబైలో విక్కీ, Katrina Kaif పెళ్లి రిసెప్షన్.. ఈ 9 మంది బాలీవుడ్ స్టార్స్ అటెండ్ అవ్వట్లేదు.. కారణం ఏంటంటే..
ABN , First Publish Date - 2021-12-13T18:33:09+05:30 IST
గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తూ.. ఎట్టకేలకు డిసెంబర్ 9న ఒకటయ్యారు బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్. ఎంతో సీక్కెట్గా ఉంచిన ఈ కపుల్ మ్యారేజ్‌ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది క్యాట్.
గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తూ.. ఎట్టకేలకు డిసెంబర్ 9న ఒకటయ్యారు బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్. ఎంతో సీక్కెట్గా ఉంచిన ఈ కపుల్ మ్యారేజ్‌ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది క్యాట్. అయితే బాలీవుడ్ ఇంటస్ర్టీలో ఎంతోమంది స్నేహితులు ఉన్న ఈ జంట పెళ్లికి మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. అందుకే మిగతా ప్రముఖుల కోసం త్వరలోనే ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు ఈ నూతన దంపతులు. కాగా ఈ వేడుకకి 9 మంది స్టార్స్ అటెండ్ కావట్లేదంటా.. వారేవరో కారణాలేంటో తెలుసుకుందాం..
రణ్‌బీర్ కపూర్..
కత్రినా మాజీ ప్రియుడైన ఈ చాక్లెట్ బోయ్‌కి విక్యాట్ పెళ్లి ఆహ్వానం అందలేదని సమాచారం. క్యాట్‌తో బ్రేకప్ తర్వాత ఈ హ్యాండ్సమ్ హీరో నటి అలియా భట్‌తో డేటింగ్లో ఉన్నాడు.
అలియా భట్..
బాలీవుడ్లో కత్రినాకి ఉన్న మంచి స్నేహితుల్లో అలియా భట్ ఒకరు. అయితే క్యాట్ మాజీ ప్రియుడితో ఈ బ్యూటీ డేటింగ్ చేయడం ప్రారంభమయినప్పటి నుంచి వారి మధ్య లెక్కలు తప్పాయి. అంతేకాకుండా ఈ భామ రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
సల్మాన్ ఖాన్..
ఈ కండల వీరుడు కత్రినా మాజీ ప్రియుడు అనే విషయం అందరికి తెలిసిందే. కానీ బ్రేకప్ తర్వాత కూడా వారిద్దరి మధ్య మంచి రిలేషనే ఉంది. అందువల్ల ఈ బ్యూటీ పెళ్లికి సల్మాన్ అటెండ్ అవుతాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. తన కొత్త కన్సర్ట్ కోసం సౌదీ చెక్కెశాడు సల్లుభాయ్.
షారుక్ ఖాన్..
ఈ బాలీవుడ్ బాద్ షాకి, కత్రినాకి మంచి స్నేహామే ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆయన సినిమాల షూటింగ్స్ లేటవుతూ వచ్చాయి. దీంతో ఇప్పుడు వాటిని పూర్తి చేసే పనిలో పడడంతో షెడ్యూల్లో ఖాళీ లేకుండా పోయింది.
ప్రియాంక చోప్రా..
హాలీవుడ్ పాగా వేసిన బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా. ఈ తార కత్రినాతో కలిసి ఫరా అక్తర్ దర్శకత్వంలో ‘జీ లే జరా’ అనే సినిమా చేస్తోంది. కానీ విదేశాల్లో ఉండడం వల్ల పెళ్లి రిసెప్షన్‌కి హాజరు కాలేకపోతోంది.
వరుణ్ ధావన్..
నిజానికి వరుణ్ ధావన్, కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ‘ధర్మ పొడక్షన్స్’లో ఓ సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని విక్కీ కౌశల్ చేస్తున్నాడు. ఆ సినిమానే ‘గోవిందా నామ్ హై మేరా’. దీంతో వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం.
జాన్ అబ్రహం..
కొన్ని సంవత్సరాల క్రితం, జాన్ అబ్రహంతో కలిసి కత్రినా సినిమా చేయాల్సింది. కానీ దానికి జాన్ ఒప్పుకోకపోవడంతో ఓ మంచి మూవీ, చాలా మంచి రోల్ మిస్ అయ్యిందంటా. అప్పటి నుంచి వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు సమాచారం.
దీపికా పదుకొనే..
రణ్వీర్ సింగ్‌తో పెళ్లికి ముందు దీపికా రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ చాక్లెట్ బోయ్ చీటింగ్ చేశాడంటూ బ్రేకప్ చేప్పేసింది ఈ హీరోయిన్. అనంతరం రణ్‌బీర్‌తో ప్రేమాయణం నడిపింది కత్రినా. అప్పటి నుంచి వారికి పడట్లేదని తెలుస్తోంది.
హార్లిన్ సేథీ..
ఈ నటితో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపాడని అందరికి తెలిసిందే. అనంతరం కొన్ని కారణాల వల్ల వీరి మధ్య గ్యాప్ రావడంతో బ్రేకప్ అయ్యింది.