వాలి రీమేక్‌కు లైన్ క్లియర్
ABN , First Publish Date - 2021-11-28T08:20:59+05:30 IST
అజిత్ హీరోగా 1999లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘వాలి’ చిత్రం త్వరలో పలు భాషల్లో రీమేక్ అవనుంది...
అజిత్ హీరోగా 1999లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘వాలి’ చిత్రం త్వరలో పలు భాషల్లో రీమేక్ అవనుంది. హిందీ, కన్నడ మినహా అన్ని భాషల రీమేక్ రైట్స్‌ను గతేడాదే నిర్మాత బోనీకపూర్ దక్కించుకున్నారు. అయితే ‘వాలి’ దర్శకుడు ఎస్. జె. సూర్య కోర్టును ఆశ్రయించడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు తీర్పు బోనీకపూర్‌కి అనుకూలంగా రావడంతో త్వరలో ఆయన చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ‘వాలి’ రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. ‘వాలి’ చిత్రంతో తమిళనాట అజిత్‌కు అగ్రహీరోగా స్టార్డమ్ వచ్చింది. డబ్బింగ్ చిత్రంగా విడుదలై తెలుగునాట కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.