ఆ నటుడు నా పేరును టాటూగా వేయించుకున్నాడు.. నన్ను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడంటున్న Urfi Javed
ABN , First Publish Date - 2021-11-29T23:16:28+05:30 IST
బిగ్‌బాస్ ఓటీటీలో నటించి ఫేమ్‌ను సంపాదించుకున్న నటి ఉర్ఫీ జావేద్. అప్పుడప్పుడు మాటలను తూటలా సంధిస్తుంటుంది. గతంలో ఆమె పరస్ కల్నవట్

బిగ్‌బాస్ ఓటీటీలో నటించి ఫేమ్‌ను సంపాదించుకున్న నటి ఉర్ఫీ జావేద్. అప్పుడప్పుడు మాటలను తూటలా సంధిస్తుంటుంది. గతంలో ఆమె పరస్ కల్నవట్ అనే నటుడితో డేటింగ్ చేసింది. మేరీ దుర్గ అనే షో చేస్తున్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాజాగా ఆ రిలేషన్‌షిప్‌పై ఆమె స్పందించింది.
‘‘నాకు అతడితో ఎటువంటి సంబంధం లేదు. అతడితో డేటింగ్ చేయడం అనేది నేను చేసిన ఒక తప్పు. మేం డేటింగ్ చేయడం మొదలుపెట్టాక నెలరోజులకే బ్రేకప్ చెప్పాను. నా దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడిన కూడా అతడు సహించేవాడు కాదు. శరీరం మీద 3 చోట్ల నా పేరును టాటూగా వేయించుకున్నాడు. నన్ను లొంగ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ బంధానికి బ్రేకప్ పడింది. శరీరం మొత్తం టాటూలు వేయించుకున్న కూడా అతడి దగ్గరికి నేను వెళ్లను. రిలేషన్‌షిప్‌ను కొనసాగించను. ప్రస్తుతం అతడు మరొకరితో డేటింగ్ చేస్తున్నాడు ’’ అని ఉర్ఫీ జావేద్ చెప్పింది. పరస్ కల్నవట్ ప్రస్తుతం అనుపమ అనే షోలో నటిస్తున్నాడు. తనను ఆ షోలోకి రాకుండా అడ్డుకున్నాడని ఆమె ఆరోపించింది. ఆ షోలో తనను ఏ పాత్రకు కూడా ఎంపిక చేయొద్దని కాస్టింగ్ టీంకు చెప్పాడని స్పష్టం చేసింది.