అమిత్ షా, జయలలిత పేర్లు వాడేసుకున్న మోసగాడు! అడ్డంగా బుక్కైన Jacqueline Fernandez
ABN , First Publish Date - 2021-12-14T19:14:35+05:30 IST
200 కోట్ల రూపాయల భారీ మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం జాక్విలిన్ ఫెర్నాండెజ్ విచారణ ఎదుర్కొంటోంది. అందుకు అసలు కారకుడు సుఖేశ్ చంద్రశేఖర్. ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్త భార్య నుంచీ అతను అక్రమంగా వందల కోట్లు వసూలు చేశాడు. ఆ హవాలా డబ్బులోంచే జాక్విలిన్‌కు భారీ మొత్తంలో బహుమతులు ఇచ్చాడు సుఖేశ్. ఆ వివరాలన్నీ తమ ఇంటరాగేషన్‌లో రాబడుతోన్న ఈడీ అధికారులు ఛార్జ్‌షీట్‌లో ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలు వెల్లడించినట్టు సమాచారం...

జాక్విలిన్ ఇప్పటికే రెండుసార్లు ఈడీ ముందు హాజరైంది. ఆమెను పలు రకాలుగా ప్రశ్నించిన అధికారులు కోట్ల రూపాయల డబ్బు, బహుమతులు ఆమెకు ముట్టినట్టు నిర్ధారించారు. అమెరికాలో ఉన్న జాక్విలిన్ సొదరికి భారీ మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేయటం మొదలు బాలీవుడ్ బ్యూటీకి ఖరీదైన గుర్రం, వజ్రాల చెవిపోగులు గిఫ్ట్‌గా ఇవ్వటం వరకూ సుఖేశ్ చంద్రశేఖర్ చేయనది లేదు! అసలు మొదట్లో జాక్విలిన్‌ను ట్రాప్ చేయటానికి చంద్రశేఖర్ ఏకంగా అమిత్ షా, జయలలిత వంటి వారి పేర్లు వాడుకున్నాడట!
ఘరానా మోసగాడు సుఖేశ్ ‘కాలర్ ఐడీ స్పూఫింగ్’ టెక్నాలజీతో ఫోన్లు చేసేవాడంటోంది ఈడీ. ఇంతకీ సదరు టెక్నాలజీ ఎలా పని చేస్తుంది? దాన్ని ఉపయోగించినప్పుడు ఎవరికైతే ఫోన్ చేస్తామో... వారి మొబైల్ స్క్రీన్ మీద ప్రముఖుల పేర్లు డిస్ప్లే అవుతాయి. అటువంటి పద్ధతిలోనే జాక్విలిన్‌కు ఫోన్ చేసిన సుఖేశ్ చంద్రశేఖర్ తాను ‘శేఖర్ రత్నవేలు’ అని పరిచయం చేసుకున్నాడు. అమిత్ షా దగ్గరి వాడినని, జయలలిత బంధువునని కూడా చెప్పాడు. సన్ టీవీ సైతం తనదేనంటూ బుకాయించాడు. అవన్నీ నమ్మిన శ్రీలంక సుందరి 2021 ఫిబ్రవరీ నుంచీ ఆగస్ట్ మధ్య సుఖేశ్‌తో క్లోజ్‌గా మూవ్ అయింది. అతడిచ్చిన ఖరీదైన గిఫ్టులు తీసుకుంది. ఆ లిస్ట్ మొత్తం తాజాగా ఈడీ అఫీషియల్స్‌కు తెలియజేసింది. ఆమె చెప్పిన వివరాలే వాళ్లు చార్జ్‌షీట్‌లో పేర్కొనట్టు సమాచారం.
తెర మీద అద్భుతంగా నటించే కథనాయికల ముందే మరింత చక్కగా నటించాడు సుఖేశ్ చంద్రశేఖర్. అతడి నటనకి ఫిదా అయిన జాక్విలిన్ పెద్ద గండంలోనే ఇరుక్కుంది. మరోవైపు, హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా ఇదే మోసగాడి కారణంగా అడ్డంగా బుక్కవ్వాల్సి వచ్చింది. ఆమెతో సైతం ‘‘నేను మీకు పెద్ద ఫ్యాన్’’ అంటూ కబుర్లు చెప్పిన చంద్రశేఖర్ ఓ బీఎండబ్ల్యూ బహుమతిగా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ వివరాలు కూడా ఆరా తీస్తున్నారు ఈడీ ఇన్వెస్టిగేటర్స్...