ఇన్‌స్టాగ్రామ్ అడ్డాపై... గడ్డం బాబుల... హల్‌చల్!

ABN , First Publish Date - 2021-12-14T20:52:28+05:30 IST

ఇంతకు ముందు ఏదైనా వస్తువుకి ప్రచారం కావాలంటే పత్రికలు, రేడియో, టీవీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటితో పాటూ ఇన్‌స్టాగ్రామ్ జత చేరింది. వివిధ సినిమా రంగాల్లోని సెలబ్రిటీలు ఈ మధ్య వీలైనప్పుడల్లా తమ బ్రాండ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా శాండల్‌వుడ్ ‘రాకీ భాయ్’ యశ్, బాలీవుడ్ ’గ్రీకు వీరుడు’ హృతిక్ ఒకే బ్రాండ్‌ని ఆన్‌లైన్‌లో తెగ మెచ్చుకుంటూ కనిపించారు!

ఇన్‌స్టాగ్రామ్ అడ్డాపై... గడ్డం బాబుల... హల్‌చల్!

ఇంతకు ముందు ఏదైనా వస్తువుకి ప్రచారం కావాలంటే పత్రికలు, రేడియో, టీవీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటితో పాటూ ఇన్‌స్టాగ్రామ్ జత చేరింది. వివిధ సినిమా రంగాల్లోని సెలబ్రిటీలు ఈ మధ్య వీలైనప్పుడల్లా తమ బ్రాండ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా శాండల్‌వుడ్ ‘రాకీ భాయ్’ యశ్, బాలీవుడ్ ’గ్రీకు వీరుడు’ హృతిక్ ఒకే బ్రాండ్‌ని ఆన్‌లైన్‌లో తెగ మెచ్చుకుంటూ కనిపించారు!

‘బియర్డో’... ఇది మగవాళ్ల కోసమే ఉత్పత్తుల్ని అందించే మల్టీ నేషనల్ బ్రాండ్. ముఖ్యంగా, మగవారి గడ్డానికి సంబంధించిన క్రీములు, ఆయిల్స్... ఇలా పలు రకాల ప్రాడక్ట్స్ అందుబాటులో ఉంచుతుంటుంది. ‘బియర్డో’కి బాలీవుడ్‌లో హృతిక్ బ్రాండ్ అంబాసిడర్‌ కాగా దక్షిణాదిలో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ ప్రచారం చేసి పెడుతున్నాడు. కొన్నాళ్ల క్రితమే ఆయన తన ఇన్ స్టాగ్రామ్‌లో ‘‘మగవాళ్ల నుంచీ... అబ్బాయిల్ని వేరు చేసే టైం వచ్చేసింది!’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ‘బియర్డో’ కొత్త యాడ్‌ను షేర్ చేశాడు! గడ్డం లేని ఓ కుర్రాడ్ని హాట్ బ్యూటీ అమాంతం వదిలేసి బియర్డ్‌తో ఉన్న మన హ్యాండ్సమ్ యశ్ వద్దకి వచ్చేయటమే... అడ్వర్టైజ్మెంట్ సారాంశం!

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ కూడా ‘బియర్డో’ జపం చేస్తున్నాడు. రెగ్యులర్‌గా చేసే పెయిడ్ ప్రమోషనే కాక లెటెస్ట్‌గా ‘హానెస్ట్ ఒపీనియన్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ జత చేసి తన మనసులో మాట చెప్పాడు. ‘నిజంగా చెబుతోన్నా’ అంటూ ‘‘బియర్డో ప్రాడక్ట్స్ నా జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చేశాయి. అందుకే, వారి ఉత్పత్తుల్ని ప్రశంసించేందుకు ఈ పోస్ట్ పెడుతున్నాను. హెయిర్ వ్యాక్స్ విషయంలో బియర్డోకి నా ప్రత్యేక ధన్యవాదాలు. (బియర్డో హెయిర్ వ్యాక్స్ నా సమయాన్ని ఎంతో ఆదా చేయటమే కాదు శ్రమని తగ్గించింది కూడా. ఒక్క నిమిషం చాలు. వెంటనే నేను బయలుదేరేందుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైపోతాను!) బియర్డో వారి గాడ్‌ఫాదర్ బియర్డ్ ఆయిల్ కూడా... నాకు ఎంతో ఇష్టం!’’ అని తన అభిమానం చాటుకున్నాడు హృతిక్!

మారుతోన్న కాలంతో పాటూ మార్కెట్ కూడా మారుతోంది. ప్రచారం చేసే పద్ధతులు, వేదికలు మారిపోతున్నాయి. ఆడవారి కేశాలే కాదు మగవారి గడ్డాలు కూడా ఇప్పుడు ప్రచారానికి అంశాలుగా మారిపోతున్నాయి. స్టార్ హీరోలకు కాసులు రాలుస్తున్నాయి...   

Updated Date - 2021-12-14T20:52:28+05:30 IST