సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పెళ్లయి రెండ్రోజులు కూడా కాకముందే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గురించి కొత్త న్యూస్.. ఇదేంటని ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..!

ABN, First Publish Date - 2021-12-11T22:18:53+05:30

పెళ్లికి ముందు క్షణాలు యుగాలుగా గడిస్తే... పెళ్లైన కొత్తలో యుగాలు క్షణాల్లా కరిగిపోతుంటాయి. విక్కీ అండ్ కత్రీనా కౌశల్ కూడా ప్రపంచాన్ని మరిచి అదే విధంగా రొమాంటిక్‌గా కొన్నాళ్లు గడిపేస్తారని మీరేమైనా అనుకుంటున్నారా? ఒకవేళ అలా భావిస్తే తప్పులో కాలేసినట్టే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లికి ముందు క్షణాలు యుగాలుగా గడిస్తే... పెళ్లైన కొత్తలో యుగాలు క్షణాల్లా కరిగిపోతుంటాయి. విక్కీ అండ్ కత్రీనా కౌశల్ కూడా ప్రపంచాన్ని మరిచి అదే విధంగా రొమాంటిక్‌గా కొన్నాళ్లు గడిపేస్తారని మీరేమైనా అనుకుంటున్నారా? ఒకవేళ అలా భావిస్తే తప్పులో కాలేసినట్టే! 


కొత్త జంట విక్కీ అండ్ క్యాట్ రొమాంటిక్ హాలీడేస్ ఎంజాయ్ చేయబోవటం లేదు. హనీమూన్ ట్రిప్పు కాదు కదా కనీసం ఇంట్లోనూ కలసి ఉండాలనుకోవటం లేదు. ఏడు అడుగులు వేసిన వారంలోపే ఎవరి పనుల్లో వారు పడిపోనున్నారు. ఆమె డిసెంబర్ 15 నుంచీ బిజీ! అతడేమో 20వ తేదీ నుంచీ కంటిన్యూగా 50 డేస్ ఇంటికి దూరంగా... 


మిస్ కత్రీనా కైఫ్ పాల్గొన్న చివరి సినిమా షూటింగ్... మిసెస్ విక్కీ కౌశల్ సెట్ మీద కాలుమోపబోతోన్న తొలి చిత్రం... రెండూ ‘టైగర్ 3’నే! సల్మాన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్. మూడోసారి ‘టైగర్’ ఫ్రాంఛైజ్‌‌లో సల్మాన్, కత్రీనా జోడీ కడుతున్నారు. అయితే, డిసెంబర్ 15 నుంచి కత్రీనా పాల్గొనబోయే షూటింగ్ ‘టైగర్ 3’ సినిమాదే. ఆమె కొద్ది రోజుల పాటూ సల్మాన్‌తో కలసి చిత్రీకరణలో పాల్గొంటుంది. ఆ తరువాత జనవరి నెలలో మరో షెడ్యూల్ ఢిల్లీలో ఉంది. ముంబై తరువాత కత్రీనా 2022 తొలి నెలలోనే ఢిల్లీకి ప్రయాణం కానుంది. 


బ్యాచిలర్ స్టేటస్ పొగొట్టుకున్న తాజా బాలీవుడ్ భర్త... విక్కీ కౌశల్ కూడా ఫుల్ బిజీయేనట. మనసుపడి మనువాడిన మన ‘మల్లీశ్వరి’తో నాలుగు రోజులు రొమాంటిక్‌గా గడిపే సీన్ అస్సలు కనిపించటం లేదు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందిస్తోన్న ఇంకా టైటిల్ ఖరారు కాని సినిమా కోసం ఇండోర్ వెళ్లనున్నాడు. అక్కడే డిసెంబర్ 20 నుంచీ 50 రోజుల పాటూ సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేయనున్నాడు. ‘గోవిందా నామ్ మేరా, సామ్ బహదూర్’ టైటిల్స్‌తో మరో రెండు సినిమాలు కూడా విక్కీ 2022లో పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా చూస్తే కత్రీనాతో కాస్త హ్యాపీగా కాలం గడపటానికి విక్కీకి ఇంకా చాలా రోజులే పట్టేలా ఉంది!


రాజస్థాన్‌లో అతి కొద్ది మంది అతిథుల నడుమ పెళ్లి తంతు కానిచ్చేసిన విక్యాట్ జోడీ ఇంకా ఒక రిసిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంది. ముంబైలో గ్రాండ్ రిసిప్షన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, డిసెంబర్, జనవరి మొత్తం కొత్త జంట బిజిబిజీ అయితే పార్టీ ఇచ్చేదెప్పుడు? ప్రస్తుతానికైతే సస్పెన్స్! 

Updated Date - 2021-12-11T22:18:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!