కన్నీళ్లు ఆగలేదు : అనుష్క శర్మ
ABN , First Publish Date - 2021-05-04T16:30:00+05:30 IST
ఎంతో నమ్మకం.. ఆశతో అవార్డ్ వస్తుందని వెళ్ళిన నాకు నిరాశ మిగిలి కన్నీళ్ళు ఆగలేదంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన అనుష్క శర్మ మొదటి సినిమాతోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం అందుకుంది.
ఎంతో నమ్మకం.. ఆశతో అవార్డ్ వస్తుందని వెళ్ళిన నాకు నిరాశ మిగిలి కన్నీళ్ళు ఆగలేదంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన అనుష్క శర్మ మొదటి సినిమాతోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం అందుకుంది. అంతేకాదు ఈ సినిమా సూపర్ హిట్‌ను అందుకుంది. డెబ్యూ హీరోయిన్‌గా అనుష్క శర్మకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ సినీ ప్రముఖులు అనుష్క శర్మ పర్ఫార్మెన్స్ సూపర్బ్ అంటూ పొగడ్తలతో ముంచేశారట. ఇన్ని ప్రశంసలు అందుకున్న అనుష్క శర్మ ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు దక్కుతుందని భావించిందట. అదే నమ్మకం, ఆశతో అవార్డ్ ఫంక్షన్‌కి వాచ్చానని.. కానీ నేననుకున్నట్టు అవార్డ్ దక్కలేదని తెలిపింది. ఇదే సమయంలో కొందరు ..నువ్వు పెద్ద అందగత్తెవి కావు.. సన్నగా నాజుగ్గా ఉంటావు కాబట్టే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అంతేగానీ నీలో హీరోయిన్‌కు ఉండాల్సిన క్వాలిటీస్ లేవంటూ కామెంట్ చేశారట. ఇవన్ని చూసి ఆ సమయంలో కన్నీళ్ళు ఆగలేదంటు చెప్పుకొచ్చింది అనుష్క శర్మ. అయితే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ..'రబ్ దే బనాది జోడీ' చూశా.. అందులో మీ నటన చాలా బాగుందని చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది..అప్పుడు అమితాబ్ గారి మాటనే అవార్డుగా భావించాను.. అంటూ ఇటీవల ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.