తాప్సీ 'బ్లర్' షూటింగ్ పూర్తి
ABN, First Publish Date - 2021-09-04T15:58:33+05:30
యంగ్ బ్యూటీ తాప్సి నటిస్తున్న చిత్రం 'బ్లర్'. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. గత కొంతకాలంగా బాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ క్రేజీ హీరోయిన్గా మారింది.
యంగ్ బ్యూటీ తాప్సి నటిస్తున్న చిత్రం 'బ్లర్'. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. గత కొంతకాలంగా బాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ క్రేజీ హీరోయిన్గా మారింది. గ్లామర్ రోల్స్ తగ్గించి ఎక్కువగా కథా బలమున్న చిత్రాలలోనే నటిస్తూ హిట్స్ అందుకుంటున్న తాప్సీ, ఇదే క్రమంలో మరో వైవిధ్యమైన చిత్రంతో రాబోతోంది. 'బ్లర్' అనే టైటిల్‌తో అజయ్ భల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ గత కొన్ని రోజులుగా నైనిటాల్లో జరుగుతూ.. తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తాప్సి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక 'బ్లర్' మూవీని స్పానిష్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన 'జులియాస్ ఐస్'కు హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రానికి శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా తాప్సీ చాలాకాలం తర్వాత 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇక విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఆమె నటించిన 'అన్నా బెల్లె సేతుపతి' ఈ నెలలోనే రిలీజ్ కాబోతోంది.