హిందీ పాటకు టాంజానియా అన్నాచెల్లెళ్ల రీల్.. ఫిదా అయిన Kiara Advani..
ABN , First Publish Date - 2021-11-29T18:46:52+05:30 IST
ఇంటర్నెట్ ఉపయోగం పెరిగాక ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. దీంతో వేరే దేశాలకు చెందిన అన్ని విషయాలు కూడా సులువుగా ఇతర దేశాల వారికి తెలిసిపోతున్నాయి...

ఇంటర్నెట్ ఉపయోగం పెరిగాక ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. దీంతో వేరే దేశాలకు చెందిన అన్ని విషయాలు కూడా సులువుగా ఇతర దేశాల వారికి తెలిసిపోతున్నాయి. అలాగే ఓ దేశంలోని సినిమా పాటలు ఎల్లలు దాటి భాష తెలియని ఇతర దేశాల్లో మోగుతున్నాయి. కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ‘షేర్షా’ చిత్రంలోని ఓ పాట ఇప్పడు టాంజానియా చేరింది.
టాంజానియాకి చెందిన కిలీ పాల్కి సోషల్ మీడియాలో 70వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ యువకుడు, తన చెల్లితో కలిసి ‘షేర్షా’లోని ఓ హిందీ పాటకి చేసిన రీల్ వైరల్‌గా మారింది. దీనికి మంచి సాంగ్స్‌ని మేం ఎంజాయ్ చేస్తున్నామంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ వీడియో చూసిన ఎంతో ఇండియన్ నెటిజన్లు కామెంట్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ని ముంచేస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ రీల్‌ని రీ పోస్ట్ చేయడమే కాకుండా దానికి హార్ట్ సింబల్స్ పెట్టింది. దీంతో ఇది భారత్‌లో సైతం వైరల్‌గా మారింది. ‘ఓహ్.. ఫర్ఫెక్ట్ లిప్ సింక్’ అంటూ కొందరు.. ‘అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఇరగదీశారు. మీ ట్రెడిషనల్ డ్రెస్‌లో చేయడం ఎంతో బావుందం’టూ మరికొందరు.. ‘హిందీ రాకపోయిన ఖచ్చితమైన లిప్ సింక్ ఇచ్చారం’టూ ఇంకొందరు ఇండియన్స్ వారిపై తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. ఈ టాంజానియన్ సోదరసోదరీమణులా వీడియోపై మీరు ఓ లుక్కేయండి..