తన కూతురు టీనేజ్‌లోకి వచ్చాక... అలా మాత్రం చేయనంటోన్న Lara Dutta...

ABN , First Publish Date - 2021-11-29T17:59:09+05:30 IST

43 ఏళ్ల సీనియర్ యాక్ట్రస్ తన వయస్సుకు తగ్గ పాత్రతో స్మార్ట్ స్క్రీన్‌పై అలరించింది. ఆమె నటించిన ‘హికప్స్ అండ్ హుకప్స్’ వెబ్ సిరీస్ ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో లారా ఓ టీనేజీ అమ్మాయికి తల్లిగా నటించింది...

తన కూతురు టీనేజ్‌లోకి వచ్చాక... అలా మాత్రం చేయనంటోన్న Lara Dutta...

ఓటీటీల యుగం మొదలయ్యాక... వెబ్ సిరీస్‌ల శకం కొనసాగుతుండటంతో... చాలా మంది నటీనటులు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మాజీ బ్యూటీ క్వీన్ లారా దత్తా కూడా అదే చేస్తోంది. తాజాగా ఈ 43 ఏళ్ల సీనియర్ యాక్ట్రస్ తన వయస్సుకు తగ్గ పాత్రతో స్మార్ట్ స్క్రీన్‌పై అలరించింది. ఆమె నటించిన ‘హికప్స్ అండ్ హుకప్స్’ వెబ్ సిరీస్ ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో లారా ఓ టీనేజీ అమ్మాయికి తల్లిగా నటించింది... 


తెరపై ఓ టీనేజ్ గాళ్‌తో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే మమ్మీగా నటించిన లారా... తాను రియల్ లైఫ్‌లో మాత్రం ఆ పని చేయనని తేల్చి చెబుతోంది. ప్రస్తుతం లారా దత్తా, మహేశ్ భూపతి క్యూట్ డాటర్‌కి నైన్ ఇయర్స్. భవిష్యత్తులో ఆమె టీనేజ్‌లోకి ఎంటరైనప్పటికీ లారా మాత్రం కూతురితో స్నేహితురాలిలా మసులుకోదట. ఎలాంటి మొహమాటలు లేకుండా క్లోజ్‌గా మూవ్ అయ్యే తల్లీకూతుళ్ల గురించి ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నప్పటికీ లారాకి దానిపై సదభిప్రాయం లేదట!


తన కూతురు పెద్దవుతున్న కొద్దీ మరింత చనువుగా ఉంటానని చెబుతూనే ఫ్రెండ్‌గా మాత్రం మారిపోనని అంటోంది లారా. ఎందుకంటే, ‘‘తల్లి స్నేహితురాలైపోతే ఇక కూతురికి తల్లిగా మిగిలేది ఎవరు?’’ అని ఆమె ప్రశ్నిస్తోంది. అందుకే, లారా కూతురితో ఎప్పుడూ తల్లిగానే వ్యవహరిస్తానని నొక్కి చెప్పింది. అయితే,  తెర మీద మాత్రం ఆమె టీనేజ్ అమ్మాయికి మమ్మీగా సూపర్బ్‌గా నటించిందంటున్నారు నెటిజన్స్. ‘హికప్స్ అండ్ హుకప్స్’ పాజిటివ్ రివ్యూస్‌తో స్ట్రీమింగ్ అవుతోంది...                              

Updated Date - 2021-11-29T17:59:09+05:30 IST