నా చనుబాలను Ayushmann Khurrana తాగాడు.. షాకింగ్ సంఘటనను బయటపెట్టిన భార్య Tahira Kashyap

ABN , First Publish Date - 2021-10-25T18:22:07+05:30 IST

`అంధాధున్` సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా.

నా చనుబాలను Ayushmann Khurrana తాగాడు.. షాకింగ్ సంఘటనను బయటపెట్టిన భార్య Tahira Kashyap

`అంధాధున్` సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. అంతేకాదు ఆ సినిమాలో నటనకుగానూ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఆయుష్మాన్ భార్య తాహిర కశ్యప్ తాజాగా తమ వ్యక్తిగత విషయాల గురించి ఓ పుస్తకం రాసింది. అందులో ఆయుష్మాన్ ఖురానా తన చనుబాలు తాగినట్టు తాహిర వెల్లడించడం సంచలనంగా మారింది. 


`నా ఏడు నెలల కొడుకును మా అమ్మ దగ్గర వదిలేసి నేను, ఆయుష్మాన్ మూడు రోజులు బ్యాంకాక్ ట్రిప్ వెళ్లాం. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు నా చనుబాలను బాటిల్స్‌లో నింపి మా అమ్మకు ఇచ్చాను. అయినా నా చనుబాలు వస్తూనే ఉన్నాయి. దీంతో బ్యాంకాక్ వెళ్లిన తర్వాత బాటిల్‌లో నింపాను. మా అమ్మకు ఫోన్ చేసి వచ్చే సమయానికి ఆ బాటిల్ ఖాళీగా ఉంది. ఏమైందని అడిగితే.. తన ప్రోటీన్ షేక్‌లో కలుపుకుని తాగేశానని ఆయుష్మాన్ చెప్పాడు. చాలా రుచిగా ఉన్నాయని అన్నాడు. అప్పట్నుంచి పాల బాటిల్స్ ఆయుష్మాన్ కంటబడకుండా చూస్తున్నాన`ని తాహిర పేర్కొంది. 

Updated Date - 2021-10-25T18:22:07+05:30 IST