సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పెద్ద హీరోలెవరూ నాతో పనిచేసేందుకు సిద్ధంగా లేరు: Taapsee Pannu

ABN, First Publish Date - 2021-10-08T21:18:16+05:30

తెలుగు సినిమాల్లో గ్లామర్ డాల్‌గానే కనిపించిన తాప్సీ పన్ను హిందీ చిత్ర సీమకు వెళ్లిన తర్వాత తానేంటో నిరూపించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు సినిమాల్లో గ్లామర్ డాల్‌గానే కనిపించిన తాప్సీ పన్ను హిందీ చిత్ర సీమకు వెళ్లిన తర్వాత తానేంటో నిరూపించుకుంది. ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. వరుసగా మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తోంది. మహిళా అథ్లెట్ పాత్రలో తాప్సీ నటించిన తాజా చిత్రం `రష్మీ రాకెట్`. హై-టెస్టోస్టిరాన్ సిండ్రోమ్‌తో బాధపడే ఓ మహిళా అథ్లెట్ క్రీడా వ్యవస్థతో ఎలా పోరాడిందనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 15న `జీ5`లో స్ట్రీమింగ్‌కు రానుంది.


ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీ.. హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `పెద్ద హీరోలెవరూ మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించరు. మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో హీరోయిన్ పక్కన నటిస్తే తాము ఎలివేట్ కాలేమని భయడపడతారు. కానీ, హీరోయిన్లకు అలాంటి భయాలేవీ ఉండవు. తమ పాత్ర చిన్నదైనా సరే హీరో సెంట్రిక్ సినిమాల్లో ధైర్యంగా నటిస్తారు. ఎన్నో ఏళ్లుగా మహిళలకు 90 శాతం సినిమాల్లో అప్రాధాన్య పాత్రలే వచ్చాయి. నేను నటిస్తున్న సినిమాల్లో నా పక్కన హీరోగా చేయడానికి పెద్ద హీరోలెవరూ సిద్ధంగా లేరు. ఒక్క సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి కూడా నా సినిమాకు `నో` చెబుతున్నాడ`ని తాప్సీ చెప్పింది.  

Updated Date - 2021-10-08T21:18:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!