Ind vs Pak: షారూక్ డైలాగ్‌ను గుర్తు చేసిన Taapsee Pannu!

ABN , First Publish Date - 2021-10-25T17:30:13+05:30 IST

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ భారతీయులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

Ind vs Pak: షారూక్ డైలాగ్‌ను గుర్తు చేసిన Taapsee Pannu!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ భారతీయులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రపంచ కప్‌లలో భారత జైత్రయాత్రకు బ్రేక్ వేస్తూ పాకిస్థాన్ తొలిసారి విజయం సాధించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులు టీమిండియాపై దుమ్మెత్తి పోస్తుంటే.. బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం భారత క్రికెటర్లకు బాసటగా నిలుస్తున్నారు. ప్రముఖ కథానాయిక తాప్సీ పన్ను కూడా టీమిండియా క్రీడాకారులకు మద్దతుగా నిలిచింది. 


ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై స్పందిస్తూ.. షారూక్ సినిమా డైలాగును ట్వీట్ చేసింది. `ఓటమిని స్వీకరించి తిరిగి విజయం సాధించేవాడినే `బాజీగర్` అంటారు` అంటూ ట్వీట్ చేసింది. ఇక, స్టేడియంలో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రీతీ జింటా స్పందిస్తూ.. `ఈ రోజు రాత్రి మనది కాదు. పాకిస్థాన్ బాగా ఆడింది. ఓ క్రికెట్ అభిమానిగా నేను టీమిండియాకు ఎప్పుడూ మద్దతుగానే ఉంటాను. ఇది టోర్నమెంట్‌కు ప్రారంభం మాత్రమే. మిగిలిన మ్యాచ్‌ల్లో భారత్‌కు అంతా మంచే జరగాలి` అని ట్వీట్ చేసింది. క్రికెట్ అభిమానులు ఎవరూ క్రికెటర్లపై ట్రోలింగ్‌కు పాల్పడవద్దని కోరింది. మరో హీరోయిన్ రిచా చద్దా స్పందిస్తూ.. `అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంద` పేర్కొంది. 





Updated Date - 2021-10-25T17:30:13+05:30 IST