అక్షయ్ కుమార్ సినిమాను వెనక్కినెట్టి దూసుకుపోతున్న.. తాప్సీ పన్ను మూవీ

ABN , First Publish Date - 2021-12-30T19:40:08+05:30 IST

ఓటీటీల హవా పెరిగాక సినిమాల పరిధి పెరిగిపోయింది. దీంతో కంటెంట్ బావుంటే చిన్న సినమాని సైతం స్టార్ సినిమాలను మించి ఆదరిస్తున్నారు సినీ లవర్స్...

అక్షయ్ కుమార్ సినిమాను వెనక్కినెట్టి దూసుకుపోతున్న.. తాప్సీ పన్ను మూవీ

ఓటీటీల హవా పెరిగాక సినిమాల పరిధి పెరిగిపోయింది. దీంతో కంటెంట్ బావుంటే చిన్న సినమాని సైతం స్టార్ సినిమాలను మించి ఆదరిస్తున్నారు సినీ లవర్స్. అదే రుజువు చేసింది తాప్సీ పన్ను నటించిన ‘హాసిన్ దిల్‌రుబా’. విక్రాంత్ మాస్సే కీలక పాత్రలో నటించాడు.


ఈ సంప్రదాయేతర రొమాంటిక్ థ్రిల్లర్‌‌ని వినిల్ మాథ్యూ తెరపైకి తీసుకొచ్చాడు. ఓ ప్రేమకథకి హిందీ పల్ప్ ఫిక్షన్‌ని కలిపి అద్భుతంగా సృష్టించాడు. వివిధ జోనర్లను ఒకదానితో ఒకటి కలుపుతూ ఎంతో మంది అభిమానుల మనసులను దోచుకుంది. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే ఓటీటీలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా మరో ఘనతను సొంతం చేసుకుంది. తాజా సర్వే ప్రకారం, నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వ్యూయర్‌షిప్ సాధించిన చిత్రంగా నిలిచింది.


ఈ సినిమా విడుదల నెలైన జూలై నుంచి డిసెంబర్ వరకు 24.63 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమా తర్వాతే అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’, కృతి సనన్ ‘మీమీ’, కార్తీక్ ఆర్యన్ ‘ధమాకా’ నిలిచాయి.


వినీల్ మాథ్యూ దీని గురించి తన ఉత్సాహాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఢిపరెంట్ కథతో ఛాలెంజింగ్ డ్రామాగా తెరకెక్కిన హసీన్ దిల్‌రూబా సినిమా ఓ ఫిల్మ్ మేకర్‌గా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ చూరగొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఆలోచనను అనుసరిస్తూ, భవిష్యత్తులో సైతం ఇలాంటి మంచి కాన్సెప్ట్‌లను తెరమీదకి తీసుకువచ్చేలా దోహదపడుతుంద’ని చెప్పుకొచ్చాడు.


అయితే, ఈ సక్సెస్‌ గురించి ఈ సినిమా తారాగణం తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే, రచయిత కనికా ధిల్లాన్, చిత్రనిర్మాత వినీల్ మాథ్యూ, ఆనంద్ ఎల్ రాయ్ దీని గురించి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-30T19:40:08+05:30 IST