ఆ పని చేయకండంటూ ఫ్యాన్స్‌కు సుశాంత్ సోదరి రిక్వెస్ట్
ABN , First Publish Date - 2021-06-04T14:25:20+05:30 IST
బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో తమ బాధను వ్యక్తం చేశారు. రీసెంట్‌గా ఆయన సోదరి మీతూ సింగ్ సోదరుడు మరణంపై బాధను వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్‌కు ఓ రిక్వెస్ట్ కూడా చేశారు.

గత ఏడాది అనుమానాస్పద రీతిలో చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో తమ బాధను వ్యక్తం చేశారు. రీసెంట్‌గా ఆయన సోదరి మీతూ సింగ్ సోదరుడు మరణంపై బాధను వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్‌కు ఓ రిక్వెస్ట్ కూడా చేశారు. సుశాంత్ పేరుని కొందరు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని ఫీల్ అయ్యారు. అలాంటి వారిని నమ్మకండని చెప్పిన మీతూ.. ‘మా కుటుంబం సుశాంత్ పేరుపై ఫండ్ రైజింగ్ కార్యక్రమాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. మా కుటుంబంలో జరిగిన విషాదాన్ని మీ స్వలాభానికి ఉపయోగించుకోకండి’ అంటూ ఈ సందర్భంగా తెలిపారు.