సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఈ FRESH HERO కి సిగరెట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదట!

ABN, First Publish Date - 2021-11-28T17:58:02+05:30

25 ఏళ్ల స్టార్ కిడ్ ఇంత వరకూ ఎప్పుడూ దమ్ము కొట్టలేదట! కానీ, ‘తడప్’ సినిమాలో హీరో సిగరెట్ స్మోకర్. అందుకే, తొలి చిత్రం కోసం పొగ త్రాగటం నేర్చుకున్నాడట. ఆయనకు షూటింగ్‌కు ముందు సిగరెట్ ఎలా పట్టుకోవాలి, ఎలా పొగను పీల్చాలి, ఎలా వదలాలి... ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చారట!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి. తన డెబ్యూ మూవీ ‘తడప్’ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఒకింత ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టాడు. 25 ఏళ్ల స్టార్ కిడ్ ఇంత వరకూ ఎప్పుడూ దమ్ము కొట్టలేదట! కానీ, ‘తడప్’ సినిమాలో హీరో సిగరెట్ స్మోకర్. అందుకే, తొలి చిత్రం కోసం అహాన్ శెట్టి పొగ త్రాగటం నేర్చుకున్నాడట. ఆయనకు షూటింగ్‌కు ముందు సిగరెట్ ఎలా పట్టుకోవాలి, ఎలా పొగను పీల్చాలి, ఎలా వదలాలి... ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చారట!


అహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా రూపొందిన ‘తడప్’ మూవీ మన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకి రీమేకే. త్వరలో విడుదల కానున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో హీరో పాత్ర తెలుగు వారికే తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100’లో కార్తికేయ చేసిన క్యారెక్టర్ అత్యంత సహజంగా సిగరెట్లు తాగుతూ, బైక్ నడుపుతూ ఉంటుంది. కానీ, అహాన్‌కు ఆ రెండూ అలవాటు లేదట. ‘తడప్’ కోసం కొన్ని నెలల ముందే బైక్ నడపటం నేర్చుకున్నాడట. షూటింగ్‌కి వెళ్లే ముందు సిగరెట్ ఎలా పట్టుకోవాలి, ఎలా సహజంగా పొగ తాగాలి వంటివి కూడా ట్రైనింగ్ తీసుకున్నాడట!


సాధారణ కాలేజీ పిల్లలే ఈ మధ్య దమ్ము కొట్టేస్తూ, బైక్స్‌పై దూసుకుపోతున్నారు. ఇక బాగా డబ్బున్న సెలబ్రిటీల సంతానం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మన స్టార్ కిడ్స్ సిగరెట్లు ఎప్పుడో దాటేసి డ్రగ్స్ దాకా వెళ్లిపోతున్నారు! ఇటువంటి కాలంలో ‘రాముడు మంచి బాలుడు’లా సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి ఉండటం ఆశ్చర్యమే! అంతకంటే మించి సినిమా కోసం డెడికేషన్‌తో ఇప్పుడు సిగరెట్ పట్టటం మరింత మెచ్చుకోదగింది. చూడాలి మరి, ‘తడప్’ ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో...  

Updated Date - 2021-11-28T17:58:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!